Kadapa: ఏపీ ఎన్నికల ఫలితాలకు కేవలం మూడు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అల్లర్లపై ఈసీ హై అలర్ట్ అయింది. కౌంటింగ్‌పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కడప అష్టదిగ్బంధంలో ఉంది. నగరంలో పోలీస్ బలగాలు భారీగా మొహరించాయి. పట్టణ శివారు ప్రాంతాలకే బస్సులను పరిమితం చేశారు.
దుకాణాలు బంద్..
లాడ్జీలు అద్దెకు ఇవ్వొద్దని యజమానులకు ముందే హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా.. 3 రోజుల ముందే మద్యం దుకాణాలను మూసివేశారు. 4వ తేదీన కడపలో కర్ప్యూ వాతావరణం ఉంటుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద నాలుగంచెల భద్రత 112 సీసీ కెమెరాలతో నిఘా పెట్టనున్నారు.
Also Read: పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఎక్కడ?.. కొనసాగుతున్న పోలీసుల వేట..!
గృహనిర్బంధం..
కడప జిల్లా వ్యాప్తంగా 1038 మంది రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. కౌంటింగ్ రోజు ఘర్షణ వాతావరణం తలేత్తకుండా.. 652 మందిని ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా 21 మంది రౌడీ షీటర్లను జిల్లా బహిష్కరణ చేశారు. నేటి నుంచి రౌడీ షీటర్లు జిల్లా వదిలిపెట్టి వెళ్లనున్నారు. మరో 131 మంది రౌడీ షీటర్లను గృహనిర్బంధం చేశారు.
బహిష్కరణ..
మిగిలిన వారు ఇంటికే పరిమితం కావాలని పోలీసులు వెల్లడించారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిపై డేగ కన్ను వేశారు. 2024 ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన 40 మందిపై జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌషల్ రౌడీషీట్ తెరిచారు. రౌడీ షీటర్స్‌ను కలెక్టర్ విజయరామరాజు ఎదుట బైండోవర్ చేశారు. జిల్లా వదిలి పెట్టి వెళ్లాలని కలెక్టర్ విజరామరాజు ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి 6వ తేదీ వరకూ జిల్లా బహిష్కరణ చేశారు.