TDP Chief Chandrababu: ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లఘించారని నోటీసులు జారీ చేసింది. మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది. 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని కోరింది.
ALSO READ: తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు మరో షాక్
సీఎం జగన్ పై విమర్శల యుద్దానికి దిగారు చంద్రబాబు. రానున్న ఎన్నికల్లో ఏపీలో పసుపు జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ప్రచారాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ పై విమర్శలు డోస్ పెంచారు. ఇటీవల ఎమ్మిగనూరు, బాపట్ల, మార్కాపురం సభల్లో చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లఘించారని వైసీపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. సభల్లో సీఎం జగనే టార్గెట్ గా చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఈఓ ముకేష్ కుమార్ మీనాకు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల అధికారి.. వచ్చిన ఫిర్యాదుపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని బాబుకు నోటీసులు జారీ చేసింది. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.