Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్

పవన్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ఎన్నికల సంఘం. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను వెల్లడించింది. రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన పార్టీని చేర్చింది. గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. గాజు గ్లాసు గుర్తు జనసేనకు లేనట్లేనా? అనే చర్చ రాజకీయాల్లో నెలకొంది.

New Update
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్

Pawan Kalyan: మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉహించని షాక్ ఇచ్చింది. ఈసీ నిర్ణయంతో ఆ పార్టీకి కొత్త టెన్షన్ మొదలైంది. గాజు గ్లాసు గుర్తుపై మరోసారి సందిగ్థత నెలకొంది. ఫ్రీ సింబల్ జాబితాలోకి గాజు గ్లాసు గుర్తు పెట్టారు ఎన్నికల అధికారులు.

గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన పార్టీని చేర్చింది. గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఇప్పటికే గ్లాసు గుర్తుని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ లిస్ట్‌లో చేర్చడంపై న్యాయ నిపుణులతో జనసేన నేతలు చర్చిస్తున్నారు. గాజు గ్లాసు గుర్తు జనసేనకు లేనట్లేనా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఈసీ నిర్ణయంతో అందరిలో సస్పెన్స్ నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు