CM Jagan: సీఎం జగన్ నామినేషన్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ వేయనున్నారు. 24వ తేదీన శ్రీకాకుళంలో బస్సుయాత్ర ముగించుకుని నేరుగా పులివెందుల వెళ్లనున్నారు సీఎం వైఎస్ జగన్. అంతకుముందు ఈ నెల 22న సీఎం వైఎస్ జగన్ తరఫున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ పులివెందుల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ పులివెందుల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
కడప జిల్లాలో వైఎస్సార్ కుటుంబ చిచ్చు..
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో వైఎస్సార్ కుటుంబం రెండు ముక్కలుగా చీలింది. అన్నదమ్ములు ఒకవైపు, అక్క చెల్లెల్లు ఒకవైపు విడిపోయి కడపలో రాజకీయాలను వేడెక్కించారు. పులివెందులలో నుంచి ఎమ్మెల్యే గా సీఎం జగన్ పోటీ చేస్తుండగా.. వైఎస్ షర్మిల కడప నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మరోవైపు ప్రస్తుతం కడప సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డీ మరోసారి కడప నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే.. సోదరుడు అవినాష్ రెడ్డి పై షర్మిల పోటీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తన బాబాయ్ మాజీ మంత్రి వివేకను ఎంపీ అవినాష్ రెడ్డి హత్య చేశారని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. తన తమ్ముడిని కాపాడుకునేందుకు సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నీటిపాలు చేశారని మండిపడ్డారు. తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డగా.. ఆయన ఆశయాలతో మీ ముందుకు వస్తున్నానని.. తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. సొంత బాబాయ్ ని హత్య చేసిన దుండగుడికి ఓటు వేయాలో? వద్దో? ఆలోచించుకోవాలని అన్నారు. షర్మిలకు మద్దతుగా వివేకా కూతురు సునీత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.