Pulimi Venkata Ramireddy: టీడీపీలో టికెట్ల పంచాయతీకి ఇంకా తెర పడడంలేదు. టికెట్ రాని కొందరు అసంతృప్తి నేతలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరగా.. మరికొంత మంది నిరసనలు చేపడుతున్నారు. తాజాగా నరసరావుపేట అసెంబ్లీ సీటు చదలవాడ అరవిందబాబుకు కేటాయించలేదని పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు టీడీపీ సీనియర్ నాయకులు పులిమి రామిరెడ్డి. స్వగ్రామం పాలపాడులో మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధుల ముందే పురుగుల మందు తాగారు. దీంతో ఆయన్ను హుటాహుటిన నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఆయన వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ALSO READ: ఓటమి భయంతోనే చంపుతున్నారు.. వైసీపీపై లోకేష్ ఫైర్!
చంద్రబాబు నివాసం ఎదుట ఆందోళనలు..
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే 34 మంది అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కంది టికెట్ ను కదిరిలో కూడా కందికుంట ప్రసాద్‌కు కాకుండా ఆయన భార్య యశోదకు కేటాయించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాషా కు టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు.
మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాషా కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న అత్తర్ చాంద్ భాషాకు న్యాయం చేయాలని నిరసనకు దిగారు. హిందూపురం ఎంపీ టికెట్ ను ఇచ్చిన గెలిపించుకుంటామని కోరుతున్నారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలతో మాట్లాడి సర్ది చెప్పారు నారా లోకేష్. చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చాంద్ బాషా అనుచరులకు హామీ ఇచ్చారు.