Anakapalle : అనకాపల్లి లోక్‌సభ(Lok Sabha) సీటులో డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, బీజేపీ(BJP) అభ్యర్థి సీఎం రమేష్(CM Ramesh) ను ఢీకొడుతున్నారు. అభ్యర్థిలిద్దరూ నాన్ లోకల్. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రచారంలో ఘర్షణలు అనకాపల్లిలో ఎన్నికల వేడిని మరింత పెంచేశాయి. ముత్యాలనాయుడు ఆఖరి నిమిషంలో అభ్యర్థిగా ఖరారుకావడం ఇబ్బందిగా మారింది. మంత్రిగా ఉన్నా అభివృద్ధి చేయలేదనే అసంతృప్తి జనంలో ఉంది.
పైగా కుటుంబంలో అసమ్మతి పెద్ద తలనొప్పిగా మారింది. మొదటి భార్య కొడుకు బూడి రవి తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. పైగా ముత్యాలనాయుడు కూతురు పోటీ చేస్తున్న మాడుగుల అసెంబ్లీ సీటు(Assembly Seat) లో రవి ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు.
ఇక సీఎం రమేష్‌కి అన్ని చోట్లా కూటమి నేతల మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఇంటింటికీ తన పేరు, పార్టీ గుర్తు వెళ్లేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఎంపీ సీటులో రమేష్‌కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్‌గా అనకాపల్లిలో సీఎం రమేష్‌కు విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Also Read : విశాఖ ఎంపీగా బాలకృష్ణ అల్లుడు భరత్ గెలుపు? ఆర్టీవీ సర్వే లెక్కలివే!