/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/pawan-blade-comments-jpg.webp)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్నారు పవన్. ప్రచారంలో ఉన్నప్పుడు కొంతమంది కిరాయి మూకలు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కోస్తున్నారన్నారు పవన్. నన్ను, సెక్యూరిటీ సిబ్బందిని బ్లేడ్లతో గాయపరుస్తున్నారని పవన్ చెప్పారు. మన ప్రత్యర్థి పన్నాగాలు మనకు తెలిసినవేనని పరోక్షంగా జగన్‌కు చురకలంటించారు పవన్. జనసైనికుల్లారా జాగ్రత్తగా ఉండండని హెచ్చరించారు పవన్. నా మీదే దాడి చేస్తున్నారంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు పవన్. తన శ్రేణులను అప్రమత్తం చేశారు పవన్ కల్యాణ్.
గతంలో ఇంటి వద్ద రెక్కి:
ఇక పవన్‌కు ప్రాణ హాని ఉందని ప్రచారం జరగడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ప్రచారం జోరుగా జరిగింది. అక్టోబర్ 31, 2022న హైదరాబాద్‌లోని పవన్ ఇంటి వద్ద ఆదిత్య, సాయికృష్ణ, వినోద్ అనే ముగ్గురు యువకులు పవన్ బౌన్సర్లతో గొడవకు దిగారు. ఈ క్రమంలో పవన్ ఇంట్లో విందు చేసేందుకు యువకులు అక్కడికి వచ్చారని, మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులు పవన్‌ను వెంబడిస్తున్నారని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. పవన్ సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్టోబర్ 31న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి పవన్ కళ్యాణ్ బౌన్సర్లతో పోరాడిన యువకులను అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ పోలీసులు యువకులను విచారించగా.. మద్యం మత్తులో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కారు ఆపి, తమ కారును తొలగించమని చెప్పడంతో పవన్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడ్డారని చెప్పారు. యువకులను విచారించిన అనంతరం వారికి నోటీసులు జారీ చేసి అక్కడి నుంచి పంపించారు. అందుకే పవన్ పై దాడికి ఎలాంటి రెక్కీ నిర్వహించలేదని, ఎలాంటి ప్లాన్ వేయలేదని నాడు తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు.
అయితే మళ్లీ ఎలక్షన్స్ సమీపిస్తున్న సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పవన్‌తో ఫొటో దిగేందుకు వారు ఆసక్తి కనబరిచగా... ఆయన ఈ బ్లేడు కామెంట్స్ చేశారు. కొన్ని విషయాల్లో మనం ప్రొటోకాల్ పాటించాలి అని పవన్ పేర్కొన్నారు. జనసేన- టీడీపీ- బీజేపీ- కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.
Also Read: ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రకటన.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?