AP Elections 2024 : మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్

టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 శాసన సభ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలను కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

New Update
AP Elections 2024 : మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan : మచిలీపట్నం జనసేన(Janasena) లోక్ సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి(Vallabhaneni Balashowry) ని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలుగుదేశం(TDP), బీజేపీతో(BJP) పొత్తుల్లో భాగంగా జనసేన(Janasena) పార్టీకి 21 శాసన సభ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలను కేటాయించేందుకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే నిర్వహిస్తున్నట్లు పార్టీ తెలిపింది. ఇందుకు సంబంధించి సంతృప్తికర ఫలితాలు వచ్చిన అనంతరం అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: TDP Anaparthy : నల్లమిల్లికి సీటు ఇవ్వాలని ముగ్గురు ఆత్మహత్యాయత్నం!

ఇదిలా ఉంటే.. నేటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఆయన పోటీ చేస్తున్న పిఠాపురంలో నాలుగు రోజులు పవన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించిన తర్వాత తొలిసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో గొల్లప్రోలుకు చేరుకున్నారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పాదగయకు చేరుకుని అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత శక్తిపీఠంలో వారాహికి ప్రత్యేక పూజలు చేస్తారు. రోడ్డు మార్గంలో దొంతమూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ నివాసానికి వెళ్ళనున్నారు. పిఠాపురం రాజకీయ పరిణామాలపై వర్మతో చర్చించనున్నారు. సాయంత్రం 5 గంటలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలులో జరగనున్న భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు.

Advertisment
తాజా కథనాలు