TDP-JSP: తమ్ముళ్లు V/s జనసైనికులు.. హోరెత్తిన నిరసనలు..! తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనతో పలుచోట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. ఫ్లెక్సీలు చించివేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. మరికొందరు రాజీనామాలు చేస్తున్నారు. By Jyoshna Sappogula 24 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి Janasena Vs TDP - MLA Ticket WAR : ఏపీలో టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆధ్వర్యంలో మొదటి గెలుపు గుర్రాలను ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ప్రకటించారు. తెలుగుదేశంకు 94 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. కాగా, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనతో పలుచోట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. Also Read: పరిటాల శ్రీరామ్ సీటుపై ఉత్కంఠ..! రెండో సీటు ఇస్తారా? అసంతృప్తి సెగ పెడనలో టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన బూరగడ్డ వేదవ్యాస్ అస్వస్థతకు గురైయ్యారు. చంద్రబాబు మాట ఇచ్చి మోసం చేశారని వాపోతున్నారు. ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని ప్రకటించారు. రాయచోటిలో రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో రమేష్ రెడ్డి వర్గీయులు రాజీనామా చేశారు. పెనుకొండలో సవితకు టికెట్ ఇవ్వడంతో విబేధాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం జెండాలకు నిప్పు పెట్టారు పార్థసారథి వర్గీయులు. పి.గన్నవరంలో మహాసేన రాజేష్‌కు టికెట్ ఇవ్వడంతో టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహాసేన రాజేష్‌కు సహకరించేది లేదని తేల్చిచెబుతున్నారు. అనకాపల్లి సీటు జనసేన నుంచి కొణతాలకు ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పీలా గోవింద్‌కు టికెట్ ఇవ్వకుంటే పార్టీకి రాజీనామా చేస్తామని అల్టిమేటం జారీచేశారు. Also Read: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్..! జగ్గంపేట టికెట్ జ్యోతుల నెహ్రూకు ఇవ్వడంతో జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగ్గంపేట జనసేన ఇన్‌ఛార్జి సూర్యచంద్ర కంటతడి పెట్టుకున్నారు. గజపతి నగరంలో పార్టీ పదవులకు రాజీనామా చేశారు టీడీపీ ఇన్‌ఛార్జి కే.ఏ.నాయుడు. కొండపల్లి శ్రీనివాస్‌కు గజపతినగరం టికెట్ ఇవ్వడంతో ఫైర్ అవుతున్నారు. డోన్ నియోజకవర్గ టీడీపీలోనూ అసమ్మతి సెగ భగ్గుమంటోంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ధర్మవరం సుబ్బారెడ్డి అసంతృప్తి చెందుతున్నారు. 3 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ప్రకటించారు. అటు కల్యాణదుర్గంలోనూ తెలుగుదేశం ఫ్లెక్సీలు చించివేసినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే హనుమంత చౌదరి క్యాంప్ ఆఫీసులోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. #andhra-pradesh #tdp-janasena #mla-ticket-war మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి