Macherla Assembly : మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పిన్నెల్లి (Pinnelli) సోదరుల అరాచకాలకు కాలం చెల్లిందని టీడీపీ (TDP) అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి (Julakanti Brahma Reddy) అన్నారు. ఆర్టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పోలీసులను అడ్డం పెట్టుకుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) దందాలు చేశాడని ఆరోపించారు. దోచుకోవడం, దాచుకోవడం పిన్నెల్లి సోదరులకు అలవాటన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. విగ్రహాల దొంగ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే కనీసం కాదు అని చెప్పలేకపోయాడని ఎద్దేవా చేశారు.
పోలీసులను అడ్డంపెట్టుకుని పిన్నెల్లి చేసిన అరాచకాలు ప్రజలు మర్చిపోలేదన్నారు. నిన్నటి వరకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతో ఉన్నప్పుడు కులం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఎంపీ లావు ఎలాంటి వ్యక్తి అనేది అందరికీ తెలిసిందేనన్నారు. అభివృద్ధి తప్పా విమర్శలు చేయడం తెలియని వ్యక్తి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అని అన్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.
Also Read : స్మార్ట్ ఫోన్ OTP ఇప్పుడు మరింత సేఫ్..