Kurnool: టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితా ఆ పార్టీలో చిచ్చు పెట్టింది. ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడిన నేతలు తిరుగుబాటు చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. పలుచోట్ల ఫ్లెక్సీలు చించివేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. పలువురు తీవ్ర మనస్థపంకు గురై ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాం.
Also Read: బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయ్..పేరెంట్స్..మీ పిల్లలు ఫిట్‌గా ఉండేందుకు ఈఫుడ్స్ ఇవ్వాల్సిందే.!
తాజాగా, కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆత్మహత్యయత్నం చేశాడు. టికెట్ బొగ్గుల దస్తగిరికి ఇవ్వడం పై ఆకి పోగు ప్రభాకర్ మనస్థాపం చెందాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. వెంటనే అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండే సమాజాన్ని సృష్టించడమే లక్ష్యం: మోదీ
ప్రస్తుతం మహబూబ్నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రభాకర్ చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై ప్రభాకర్ భార్య టీడీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీ కోసం పనిచేసిన నా భర్తకు అధిష్టానం అన్యాయం చేసిందంటూ వాపోతుంది. నియోజకవర్గంలో గత 15 ఏళ్లగా పనిచేస్తున్న తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పార్టీ జెండా కోసం పనిచేసిన వారికి టికెట్ ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వడంపై ప్రభాకర్ భార్య మండిపడింది. ఇప్పటికైనా అధిష్టానం పునర్ ఆలోచించాలని వేడుకుంది.
Also Watch This Video: