AP Elections 2024: తూర్పుగోదావరిలో జనసేన పోటీ చేసే సీట్లు ఇవే.. పూర్తి లిస్ట్!

పొత్తుల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఎంపీ సీటుతో పాటు 8 అసెంబ్లీ స్థానాలు అడిగాలని జనసేన భావిస్తోంది. కాకినాడ పార్లమెంట్‌ స్థానంతో పాటు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, రాజానగరం, అమలాపురం, రాజోలు, రామచంద్రపురం, మండపేట సీట్లు ఆ లిస్ట్ లో ఉన్నాయి.

AP Elections 2024: తూర్పుగోదావరిలో జనసేన పోటీ చేసే సీట్లు ఇవే.. పూర్తి లిస్ట్!
New Update

ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న జనసేన పార్టీ (Janasena Party) జిల్లాల వారీగా బలంగా ఉన్న సీట్లు ఏంటన్న లెక్కలు తీస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై జనసేనాని పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) ఫుల్ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. మూడు రోజులపాటు జిల్లా పర్యటనలో పవర్ స్టార్ జనసేన బలంగా ఉన్న సీట్లపై దృష్టి సారించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని కీలక నేతలతో సమావేశమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు ఉండే ఛాన్స్‌ ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: NTR District: మైలవరంలో వైసీపీకి షాక్..కీలక నేత రాజీనామా

ముఖ్యంగా జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబు జనసేనలో చేరతారంటూ ప్రచారం సాగుతోంది. టీడీపీతో జనసేన పొత్తు ఖాయమైన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఒక పార్లమెంట్‌తో పాటు 8 అసెంబ్లీ స్థానాలు అడిగాలని జనసేన భావిస్తోంది. కాకినాడ పార్లమెంట్‌ స్థానంతో పాటు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, రాజానగరం, అమలాపురం, రాజోలు, రామచంద్రపురం, మండపేట అసెంబ్లీ స్థానాలు తమకే ఇవ్వాలని ఆ పార్టీ పట్టుబట్టే అవకాశం ఉంది.

కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకు చంద్రబాబు ఓకే చెప్పారంటూ కూడా ప్రచారం సాగుతోంది. వచ్చే నెలలో మరోసారి 3రోజులు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. జనవరి 3 నుంచి 5 వరకు తూర్పుగోదావరిలో పవన్ పర్యటించనున్నారు.

#ap-elections-2024 #janasena #jana-sena-chief-pawan-kalyan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe