AP Politics: తెలంగాణ రిజల్ట్స్‌తో వ్యూహం మార్చిన జగన్.. ఆ 50 మంది సిట్టింగ్‌లకు నో టికెట్?

తెలంగాణ ఎన్నికల ఫలితంతో ఏపీ సీఎం జగన్‌ వ్యూహం మార్చినట్లు సమాచారం. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడని జగన్‌ ఆలోచిస్తారని సమాచారం. 50 మంది ఎమ్మెల్యేలకు బదులుగా కొత్త ముఖాలకు ఛాన్స్‌ ఇవ్వాలని జగన్‌ నిర్ణయించుకున్నారన్న టాక్‌ నడుస్తోంది.

AP Politics: తెలంగాణ రిజల్ట్స్‌తో వ్యూహం మార్చిన జగన్.. ఆ 50 మంది సిట్టింగ్‌లకు నో టికెట్?
New Update

తెలంగాణ ఎన్నికల(Telangana Elections) ఫలితాలతో ఏపీ ముఖ్యమంత్రి జగన్(Jagan) తన రూటు మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను సాగనంపాల వద్దా అనే డైలమాలో ఉన్న జగన్.. తెలంగాణ దెబ్బతో ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. మొహమాటలకు పోతే అసలుకే మోసం వస్తుందనే నిజాన్ని తెలంగాణ ఎన్నికల రిజల్ట్‌తో జగన్ తెలుసుకున్నారని టాక్ వినబడుతుంది. ఇంతకీ తెలంగాణ రిజల్ట్ జగన్ మైండ్‌ని ఎందుకు మార్చాయి? బీఆర్ఎస్ ఓటమి నుంచి జగన్ నేర్చుకున్న పాఠాలేంటి? బీఆర్ఎస్ ఓటమికి.. జగన్ వ్యూహాలకు ఉన్న సంబంధం ఏంటి? లెట్స్ రీడ్‌ దిస్ స్టోరీ..!

తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి నుంచి ఆ పార్టీ ఎన్ని పాఠాలు నేర్చుకుందో తెలియదు గానీ... చాలా రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు కేసీఆర్‌ పార్టీ నుంచి చాలా గుణ పాఠాలు నేర్చుకుంటున్నారు. అందులో ఏపీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు తరువాత.. బీఆర్ఎస్ పార్టీ ఓటమి గల కారణాలను విశ్లేషించుకుంటోంది. అటు ఏపీ కూడా బీఆర్ఎస్ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నట్లు తెలుస్తుంది. వరుస విజయాలు అంతా ఈజీ కాదని, అభ్యర్థి ఎంపిక విషయంలో వివరించాల్సిన వ్యూహాలు మార్చుకోవాలని ఆలోచనలో వైసీపీ పడినట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి.. అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టకుండా బరిలో దింపడం వల్లే బిఆర్‌ఎస్‌ నష్టపోయిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ తప్పు చేయకుండా జాగ్రత్తలు:
కెసిఆర్ చేసిన తప్పును చేయకూడదని వైసీపీ సర్కార్‌ ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టే విషయంలో మొన్నటి వరకు పెద్దగా పట్టించుకోని జగన్... తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. మొన్నటి వరకు 20 నుంచి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రమే సీటు లేదని చెప్పిన జగన్.. తాజాగా ఆ సంఖ్యను 50కు పెంచినట్లు తెలుస్తోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఇప్పటికే సర్వేలు చేయించిన జగన్... ఆ సర్వేలు ఆధారంగా వారిని పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి ఎమ్మెల్యేల ఎంపికలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం అని అభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో సిట్టింగ్ లైనా సరే... ప్రజల్లో వ్యతిరేకత ఉంటే వారిని పక్కన పెట్టాలని జగన్ నిర్ణయించుకున్నారట. వైసీపీలోని 150 మంది ఎమ్మెల్యేలు 50 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని.. జగన్ తన సర్వేల ద్వారా నిర్ధారణకు వచ్చారు. దీంతో 50 మంది ఎమ్మెల్యేలకు ఈసారి సీటు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారట. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో... ఎవరిని తాను వదులుకోవడానికి ఇష్టపడటం లేదని.. అందరినీ తనతోపాటు అసెంబ్లీలో చూడాలనుకుంటున్నానని చెప్పిన జగన్.. ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మొహమాటలకి పోయి తిరిగి సీటు ఇస్తే తెలంగాణలో రిజల్ట్ రిపీట్ అవుతుందని భావనలో ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 150 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వకూడదని.. వారి స్థానాల్లో కొత్తవారిని బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మేలు కంటే కీడే జరుగుతుందా?
అయితే జగన్ తీసుకున్న నిర్ణయం.. ఆ పార్టీకి మేలు కంటే కీడే చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను దూరం పెట్టుకోవడం ద్వారా... ఆయా నియోజకవర్గాల్లో ఆ నేతల ద్వారా తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను కూడబెట్టుకునే అవకాశం ఉంటుంది. సీటు దాని ఎమ్మెల్యేలంతా జగన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు మద్దతిచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా సీటు రాని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు అంతర్లీనంగా మద్దతు తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో దాని ప్రభావం స్పష్టంగా కనబడింది. ఇప్పుడు ఏపీలో 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ ఇవ్వకపోతే. వాళ్లంతా జగన్‌కు యాంటీగా పని చేసే అవకాశం ఉంది.

అయితే ఇలాంటి అన్ని లెక్కలు చూసుకునే.. జగన్ 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సీటు ఇవ్వన్ని ఎమ్మెల్యేలందరినీ ఏదో రకంగా పార్టీలో ఉంచి.. తిరిగి అధికారంలోకొస్తే ఏదో ఒక పదవి ఇస్తామనే భరోసాను జగన్ ఇవ్వాలనుకుంటున్నారట. మరి జగన్ తీసుకున్న కొత్త నిర్ణయాలు ఫలిస్తాయా లేదా..? సీటు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు జగన్ మాట వింటారా? లేక సొంత కుంపటి పెట్టుకుంటారా అనేది రాబోయే ఎన్నికల్లో తేలనుంది.

తెలంగాణ ఎన్నికల ఫలితంతో వ్యూహం మార్చిన వైసీపీ అధినేత జగన్‌:
---ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను తప్పించే ఆలోచనలో జగన్‌
---మొన్నటి వరకు 20-30 మందిని మార్చాలని ఆలోచన
---దాదాపు 50 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని గుర్తింపు
---ఆ 50 స్థానాల్లో కొత్త ముఖాలకు ఛాన్స్‌ ఇవ్వాలని జగన్‌ నిర్ణయం.!
---ఈ విషయంలో మొహమాటానికి పోకూడదని నిర్ణయించుకున్న జగన్‌
-----------------
--ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 స్థానాల్లో మార్పు:
--పాయకరావుపేట, అనకాపల్లి,వైజాగ్ ఈస్ట్, వెస్ట్‌ స్థానాల్లో కొత్త అభ్యర్థులు
--అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి అమర్‌నాథ్‌ను పంపే అవకాశం
--అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ రేసులో సత్యవతి
--వైజాగ్‌ ఈస్ట్‌లో MVV సత్యనారాయణను తప్పించే అవకాశం
-- విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న MVV
-- వైజాగ్‌ వెస్ట్ నుంచి అడారి ఆనంద్‌ను బరిలో నిలిపే అవకాశం
--పాయకరావుపేటలో గొల్ల బాబురావు స్థానంలో మరొకరికి ఛాన్స్‌
-----------------------
-- చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, మదనపల్లి
-- పలమనేరు, పూతలపట్టు స్థానాల్లో అభ్యర్థుల మార్పు జరిగే ఛాన్స్‌
-- తిరుపతి నుంచి భూమన తనయుడు అభినయ్‌కు ఛాన్స్
-- సత్యవేడులోనూ ఆదిమూలంను తప్పించే ఛాన్స్‌
-- చంద్రగిరి నుంచి చెవిరెడ్డి స్థానంలో ఆయన తనయుడికి అవకాశం
-- మదనపల్లిలో నవాజ్‌ బాషాను తప్పించే అవకాశం
-- పలమనేరులో ఎమ్మెల్యే వెంకట్‌ గౌడ్‌, జడ్పీ ఛైర్మన్‌ వాసు మధ్య పోటీ
-- పూతలపట్టు టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే సునీల్ ప్రయత్నం
---------------------
విజయవాడ సెంట్రల్‌, విజయవాడ పశ్చిమ, తిరువూరు, పెడన..
నందిగామ, పామర్రు ఎమ్మెల్యేలను మార్చే అవకాశం
సత్తెనపల్లిలో అంబటి రాంబాబును మరో నియోజకవర్గానికి పంపే అవకాశం
తెనాలిలో అనాబత్తుల రవికుమార్‌ను మార్చే ఛాన్స్‌
వేమూరు ఎమ్మెల్యే నాగార్జునను సంతనూతలపాడు పంపించే అవకాశం
రేపల్లె సీటును మోపిదేవి వెంకటరమణకు ఇచ్చే ఛాన్స్‌
పత్తిపాడు ఎమ్మెల్యే సుచరితకు టికెట్‌ ఇవ్వకూడదని నిర్ణయం!
ఆమె స్థానంలో కొత్త వ్యక్తి లేదా ఇతర నియోజకవర్గంలో సిట్టింగ్‌కు ఇచ్చే అవకాశం
గుంటూరు ఈస్ట్‌లో ముస్తాఫా స్థానంలో ఆయన కుమారుడికి ఇచ్చే ఛాన్స్‌
-----------------
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి దువ్వాడ వాణిని బరిలో దింపే ఛాన్స్‌
ఆముదాలవలస నుంచి తమ్మినేనిని మార్చే అవకాశం
ఎచ్చెర్ల నుంచి కిరణ్‌ను తప్పించి చిన్న శీనును బరిలో నిలిపే అవకాశం
---------------------
ఎస్‌.కోట - సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రీనివాసరావును తప్పించే ఛాన్స్‌
రాజాం నుంచి కంబాల జోగులును తప్పించే అవకాశం
-----------
పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు స్థానంలో వంగా గీతకు అవకాశం
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబును కాకినాడ ఎంపీగా పంపే ఛాన్స్‌
అమలాపురంలో పినిపే విశ్వరూప్ స్థానంలో ఆయన కొడుకు శ్రీకాంత్‌కు ఇచ్చే ఛాన్స్‌
..............
వెస్ట్‌ గోదావరి జిల్లాలో చింతలపూడి ఎలిజాను మార్చే అవకాశం
పోలవరం ఎమ్మెల్యే బాలరాజును మార్చే ఛాన్స్
కైకలూరు దూళం నాగేశ్వరరావు స్థానంలో జయమంగళంకు ఛాన్స్‌..?

Also Read: AM, PM తేడా తెలియకపోతే ఆయనెలా ప్రధాని కాగలరు? జీవిత పుస్తకంలో ‘ప్రణబ్‌’ ఎద్దేవా!

WATCH:

#ap-elections-2024 #cm-jagan #ap-politics #telangana-elections-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe