Ex Minister Hari Rama Jogaiah : ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో (AP Elections 2024) 120 అసెంబ్లీ,18 ఎంపీ స్థానాలు కూటమివేనని మాజీ మంత్రి హరిరామజోగయ్య (Hari Rama Jogaiah) అంచనా వేశారు. ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. టీడీపీతో పవన్ కలవడం కూటమికి బాగా కలిసొచ్చిన అంశం అన్నారు. చివరిలో మోదీ మంచి బూస్ట్ ఇచ్చారన్నారు. కూటమి (Alliance) విజయం సాధించడంలో కాపులు కీలక పాత్ర పోషించారన్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది కాపులు కూటమికి సపోర్ట్ చేశారన్నారు. కూటమి విజయానికి ముఖ్య కారకులు కాపులు అని అన్నారు. మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఫలితాలు తారుమారు అయ్యేవన్నారు. పవన్ కళ్యాణ్ కష్టం వల్లే కూటమి ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
మూడు పార్టీల ఓట్లు సవ్యంగా ట్రాన్స్ ఫర్ అయ్యాయన్నారు. కూటమి మేనిఫెస్టో ప్రజలను ఆకర్షించిందన్నారు. కాపుల రిజర్వేషన్ల పై ప్రధాని మోదీ (PM Modi) కు లేఖ రాశానన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు 50 వేల మెజారిటీ వస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ కు తగిన పదవి ఇవ్వాలన్నారు. పవన్ కళ్యాణ్ కు సముచిత స్థానం ఇవ్వాలని.. ఆ విషయంలో మోదీ జోక్యం చేసుకోవాలన్నారు. ఇంకా.. నరసాపురం ఎంపీగా బీజేపీ అభ్యర్థి గెలుస్తున్నాడని జోస్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబును కలుస్తాననన్నారు. హరిరామజోగయ్య పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.
Also Read : కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ ఓడిపోతాయి.. సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు