Janasena : ఎన్నికల(Elections) వేళ జనసేన పార్టీకి ఏపీ హైకోర్టు(AP High Court) లో భారీ ఊరట లభించింది. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడాన్ని ఇటీవల హైకోర్టులో జనసేన సవాల్ చేసింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల పరిధిలోని ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గ్లాస్ సింబల్(Glass Symbol) కేటాయించమని కోర్టుకు ఈసీ తెలిపింది. ఒకవేళ ఎవరికైనా గ్లాస్ గుర్తు కేటాయించినా మారుస్తామని వెల్లడించిది. మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు 6 ఎంపీ స్థానాల పరిధిలో గాజు గ్లాసు కేటాయించారని జనసేన గతంలో తెలిపింది. ఈసీ ఇచ్చిన వివరణతో జనసేన పార్టీ సంతృప్తి చెందింది. ఇండిపెండెంట్లకు గ్లాస్ గుర్తు కేటాయిస్తే తమకు భారీగా ఓట్లు చీలుతాయని భావించిన జనసేన హైకోర్టును ఆశ్రయించింది.
AP Elections 2024 : జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్!
గాజు గ్లాసు గుర్తు విషయంలో జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో రిలీఫ్ దొరికింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల పరిధిలోని ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించమని హైకోర్టుకు ఈసీ వెల్లడించింది.
Translate this News: