CM Jagan: సీఎం జగన్ కు మరో షాక్ తగలనుందా?

గాజువాక వైసీపీ కార్పొరేటర్లు, కీలక కార్యకర్తల రహస్యం సమావేశం ఏర్పాటు చేశారు. గాజువాక సిట్టింగ్‌ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఫ్యామిలీకే టికెట్‌ ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది

New Update
CM Jagan: సీఎం జగన్ కు మరో షాక్ తగలనుందా?

CM Jagan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ కు వరుస షాకులు ఎదురవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు.. కొత్త వారికి టికెట్ కేటాయించడంతో వైసీపీ కి ఆ పార్టీలోని కొందరు నేతలు రాజీనామాలు చేసి టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల్లో చేరుతున్నారు.

ALSO READ: గజదొంగల ముఠా.. చెల్లెలు షర్మిల టార్గెట్‌ గా.. జగన్‌ విమర్శల బాణాలు!

గాజువాకలో రహస్య మీటింగ్‌..

ఇప్పటికే సొంత పార్టీ నేతలు రాజీనామాలతో షాక్ లో ఉన్న ఏపీ సీఎం జగన్ కు మరో షాక్ తగలనుందా? అని అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. విశాఖలో వైసీపీ అధిష్టానికి తెలియకుండా గాజువాక వైసీపీ కార్యకర్తల రహస్య మీటింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఈ భేటీలో ఆ జిల్లా కార్పొరేటర్లు, కీలక కార్యకర్తల పాల్గొన్నట్లు తెలుస్తోంది.

కారణం ఏంటి?..

గాజువాక సిట్టింగ్‌ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఫ్యామిలీకే టికెట్‌ ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు అక్కడి వైసీపీ కార్యకర్తలు. టికెట్‌ కోసం వైసీపీ హైకమాండ్‌పై ఒత్తిడి పెంచేలా వ్యూహం రచిస్తున్నారు. ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని కలిశారు. టికెట్‌ ఇవ్వకపోతే ఏం చేయాలనే దానిపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. వైసీపీ అధిష్టానం గాజువాక ఇంఛార్జిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ను నియమించిన విషయం తెలిసిందే.

తాజాగా వైసీపీకి సిట్టింగ్ ఎంపీ రాజీనామా..

నరసరావుపేట (Narasaraopeta) ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు (Lavu Sri Krishna Devarayalu) వైసీపీ (YCP) కి రాజీనామా చేశారు. దాంతో పాటూ ఎంపీ పదవికి కూడా రాజీనామా (Resign) చేశారు. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడడం వల్లనే తాను రాజీనామా చేస్తున్నానని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.

DO WATCH: 

Advertisment
తాజా కథనాలు