Siddham : నేడే 'సిద్ధం' చివరి సభ.. 15లక్షల మంది వస్తారని అంచనా.. జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోపై ఉత్కంఠ!

ఇవాళ బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా వైసీపీ ఎన్నికల సన్నాహక సభ జరగనుంది. ఆఖరి సిద్ధం సభకు పి.గుడిపాడు ముస్తాబైంది.ఈ సభకు 15లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా. ఈ మీటింగ్‌లో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై జగన్‌ మాట్లాడే అవకాశముంది. మ.3గంకు ఈ సభ స్టార్ట్ అవుతుంది.

New Update
Siddham : నేడే 'సిద్ధం' చివరి సభ.. 15లక్షల మంది వస్తారని అంచనా.. జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోపై ఉత్కంఠ!

YCP Last Siddham Sabha : ఇవాళ(మార్చి 10) బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగే చివరి మెగా 'సిద్ధం' సభ(Siddham Sabha) లో వైసీపీ(YCP) 2024 ఎన్నికల మేనిఫెస్టోలోని కీలక అంశాలను సీఎం జగన్‌(CM Jagan) ఆవిష్కరించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు. మొత్తం 43 అసెంబ్లీ, నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, అభ్యర్థులకు జనాన్ని సమీకరించడంతోపాటు వారికి ప్రయాణ ఏర్పాట్లను చూసే బాధ్యతను అప్పగించారు. YSRC థింక్ ట్యాంక్ టెలివిజన్ అండ్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ మీటింగ్‌ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అద్దంకి అంతటా LED స్క్రీన్‌లను ఏర్పాటు చేసింది వైసీపీ. ఈ ఆఖరి 'సిద్ధం' సభను కోటి మందికి పైగా ప్రజలు చూడాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.

15లక్షల మంది వస్తారని అంచనా:
వైద్యఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతర నేతలు రెండ్రోజులుగా సిద్ధాం వేదిక వద్దే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జగన్ ఆఖరి 'సిద్ధం' సభకు 15 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా. భీమిలిలో 5 లక్షలు, దెందులూరులో 7 లక్షలు, అనంతపురంలో 10 లక్షలతో ప్రారంభమైన ప్రేక్షకుల సంఖ్య క్రమంగా పెరిగిందని మంత్రి విడుదల రజినీ చెప్పారు. సీఎం తన ప్రసంగంలో భాగంగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను ప్రజలకు వెల్లడిస్తారని రజినీ తెలిపారు. ఇక సభలో జగన్‌ ప్రజలకు మరింత చేరువగా నడిచి అభివాదం చేసేలా ర్యాంప్‌ ఏర్పాటు చేసినట్టు సమాచారం.

ఎన్నికల వరాలపై ఉత్కంఠ:
ఇవాళ మ.3 గంటల నుంచి సా.5 గంటల వరకు ఈ సభ జరుగుతుంది. మూడు, నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని వైసీపీ వర్గీయులు చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో తుది దశకు చేరుకోగా.. ఇవాళ్టి సభలో జగన్ ఎన్నికల వరాలపై కీలక వ్యాఖ్యలు చేస్తారు. మరోవైపు 2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వ పాలనా ప్రాంతాన్ని విశాఖపట్నంకు మార్చాలని జగన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అందుకే ఉత్తరాంధ్రపై దృష్టి సారించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. శనివారం ఆయన ఉత్తరాంధ్ర వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తదితర నేతలతో ఎన్నికల ప్రచారానికి సంబంధించి మాట్లాడారు. తర్వాత ఉత్తరాంధ్ర శాసనసభ్యులతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్ కోఆర్డినేటర్లు, ఇన్‌ఛార్జ్‌లతో ఆయన భేటీ అయ్యారు.

Also Read : ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా!

Advertisment
తాజా కథనాలు