ఏపీ లో మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ (CEC) పర్యటించనుంది. ఈ మేరకు ఈ నెల 8 తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం విజయవాడ చేరుకోనుంది. ఈ బృందంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ సహా ఇతర అధికారులు ఉండనున్నారు. 9 తేదీ ఉదయం ఏపీలోని రాజకీయ పార్టీలతో భారత ఎన్నికల చీఫ్ కమిషనర్ బృందం సమావేశం కానుంది.
ఇది కూడా చదవండి: DK ARUNA : నన్ను వాళ్లు ఖతం చేయాలనుకున్నారు.. ఈసారి ఎంపీగా గెలుస్తా
అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఇతర ఫిర్యాదుల పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ సమీక్ష నిర్వహించనుంది. 10వ తేదీన ఎన్నికల సన్నద్ధత పై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, కేంద్ర విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా వివిధ శాఖల కార్యదర్శులతో సీఈసీ సమావేశం కానుంది. సాయంత్రం 4.30 గంటలకు సీఈసీ, ఎన్నికల కమిషనర్ లు మీడియా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం వారు ఢిల్లీ వెళ్లనున్నారు.
ఇది కూడా చదవండి: AP Politics: విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రిగారి భార్య.. ఆసక్తిగా ఉత్తరాంధ్ర రాజకీయం!
ఇదిలా ఉంటే.. ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది. అందరికన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలన్న లక్ష్యంతో అధికార వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సమన్వయ కర్తలను కూడా ప్రకటిస్తోంది. అయితే.. అనేక మంది సిట్టింగ్ లకు నో చెబుతుండడంతో అందులో చాలా మంది ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మరికొందరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని చెబుతున్నారు. టికెట్ పై ఆశ వదులుకున్న విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలోకి చేరిపోయారు.
జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు కూడా జనసేన లేదా టీడీపీలోకి వెళ్తారన్న ప్రచారం సాగుతోంది. మరో ఎమ్మెల్యే పార్థసారథి సైతం పార్టీ మారుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను షర్మిల వెంట నడుస్తానని ఇప్పటికే ప్రకటించారు. టీడీపీలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది. విజయవాడ ఎంటీ టికెట్ నిరాకరించడంతో కేశినేని నాని కూడా పార్టీ మారనున్నట్లు చర్చ సాగుతోంది.