AP Politics: డీల్‌ డన్.. ఏపీలో బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటి చేస్తుందంటే?

బీజేపీతో టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. బీజేపీని 5 ఎంపీ, 9 ఎమ్మెల్యే సీట్లలో పోటికి దింపాలని కూటమి పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సీట్ల ఒప్పందంపై త్వరలోనే బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

AP Politics: డీల్‌ డన్.. ఏపీలో బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటి చేస్తుందంటే?
New Update

TDP-Janasena-BJP Alliance: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నా ఇప్పటివరకు టీడీపీ-జనసేన-బీజేపీ సీట్ల పంపకాలపై ఓ క్లారిటీ రాలేదు. తాము 24 ఎమ్మెల్యే స్థానాల్లో పోటి చేస్తామని పవన్‌ ప్రకటించినా బీజేపీ గురించి మాత్రం స్పష్టత లేదు. ఇప్పటివరకు టీడీపీ-జనసేన కలిపి 99 నియోజకవర్గాల్లోని అభ్యర్థులను ప్రకటించుకున్నాయి. అందులో జనసేన టికెట్లు 5 ఉండగా.. టీడీపీ టికెట్లు 94 ఉన్నాయి. అంటే జనసేన అభ్యర్థులను ఇంకా 19 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. మరి బీజేపీ సంగతేంటి? జనసేన-బీజేపీ నాలుగున్నరేళ్లుగా కలిసి పని చేస్తున్నాయి. టీడీపీతో పవన్‌ కలిసింది గతేడాదే.. అది కూడా చంద్రబాబు అరెస్ట్ తర్వాత. కానీ పొత్తులో సీట్ల పంపకాలు మాత్రం టీడీపీ-జనసేన మధ్య కుదిరాయి కానీ బీజేపీది ఎటూ తెలలేదు. అయితే బీజేపీని పోటిలో నిలబెట్టే స్థానాలపై ఓ క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది.

డీల్‌ డన్‌:

బీజేపీతో టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. బీజేపీని 5 ఎంపీ, 9 ఎమ్మెల్యే సీట్లలో పోటికి దింపాలని కూటమి పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మూడు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరినట్టేగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికే జనసేనకు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు ఇవ్వగా.. మిగిలిన 17 ఎంపీ, 142 సీట్లలో టీడీపీ పోటీ చేయనుందని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎక్కువ బీజేపీ ఎక్కువ సీట్లు అడిగిన విషయం తెలిసిందే. 7 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లను బీజేపీ డిమాండ్‌ చేసింది. చివరకు 5 ఎంపీ, 9 ఎమ్మెల్యే సీట్లకు బీజేపీ అంగీకారించాల్సి వచ్చింది. సీట్ల ఒప్పందంపై త్వరలోనే బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

బీజేపీకి ఇచ్చే సీట్లు(అంచనా)

ఎంపీ సీట్లు :

---> ఒంగోలు - పురంధేశ్వరి, రాజంపేట - కిరణ్‌కుమార్‌రెడ్డి

---> అరకు - కొత్తపల్లి గీత, నరసాపురం - RRR, తిరుపతి - రత్నప్రభ

---> అసెంబ్లీ సీట్లు : విశాఖ నార్త్‌ , తాడేపల్లిగూడెం

---> అసెంబ్లీ సీట్లు : కదిరి, ప్రొద్దుటూరు, ధర్మవరం, కైకలూరు

---> అసెంబ్లీ సీట్లు : రాజోలు, కాకినాడ

Also Read: మీరు చేయకుంటే మేమే తేల్చుకుంటాం.. కేంద్రానికి సుప్రీం వార్నింగ్

#bjp #tdp #janasena #ap-elections-2024 #ap-politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe