MLA Ramaraju: ఉండి టీడీపీ టికెట్ రఘురామకృష్ణంరాజుకు ఇస్తున్నారంటూ వస్తున్న వార్తలను సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఖండించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు. సిట్టింగ్ లు అందరికీ టికెట్లు ఇస్తామని చంద్రబాబునాయుడు చెప్పారని గుర్తు చేశారు. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలను చూసి కార్యకర్తలు, ప్రజలు ఆందోళనకు గురయ్యారన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలం అని అన్నారు రామరాజు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. రామరాజు పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.
AP Elections 2024: ఉండి టీడీపీ టికెట్ RRRకు?.. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సంచలన ఇంటర్వ్యూ!
ఇటీవల టీడీపీలో చేరిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంటూ వస్తున్న వార్తలపై సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు స్పందించారు. ఆ వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. కార్యకర్తలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు.
New Update
Advertisment