AP DSC 2024: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్ లో మార్పులు..!

ఏపీ డీఎస్సీ-2024 షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మార్చి 25వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

New Update
Breaking: ఏపీ మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం.. జూలై ఒకటి నుంచి ప్రక్రియ మొదలు..!

AP DSC 2024 Revised Dates: రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటించిన డీఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డీఎస్సీ-2024 పరీక్ష కోసం ఫిబ్రవరి 25 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ముందు ప్రకటించిన ప్రకారం ఈ నెల 15 వ తేదీ నుంచి డిఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల ఈ పరీక్షలను మార్చి 30 వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తున్నామని మంగళవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read: జనసేన పోటీ చేసే 21 సీట్ల లిస్ట్‌ ఇదే..! పవన్ పోటీ అక్కడ నుంచే..?

మొత్తం 14 రోజుల పాటు రెండు సెషన్స్ లలో పరీక్షలను నిర్వహించేలా టైం టేబుల్ ను రూపొందించామన్నారు. డీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారు షెడ్యూల్ మార్పును గమనించాలని ఆయన సూచించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు(ఎస్జీటీ) అర్హతలను మార్చడం, టెట్ పరీక్షకు డీఎస్సీ పరీక్షకు మధ్యన తగిన సమయం ఇవ్వడం తదితర కారణాల వల్ల షెడ్యూల్ లో మార్పులు అనివార్యమయ్యాయని మంత్రి వివరించారు.

Also Read: నటి ఐశ్వర్య భర్త శ్యామ్ కుమార్ ఎపిసోడ్ లో ట్విస్ట్.. లైవ్ లో ఫోన్ కాల్స్ వినిపించిన భర్త..!

సెంటర్లను ఎంపిక చేసుకోడానికి మార్చి 20 నుంచి వెబ్ ఆప్షన్లు ద్వారా అభ్యర్ధులకు అవకాశం కల్పిస్తున్నామని, హాల్ టిక్కెట్లను మార్చి 25 వ తేదీ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. నూతన షెడ్యూల్ ద్వారా లభించిన అవకాశాన్ని అభ్యర్ధులందరూ సద్వినియోగం చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు