AP DSC Recruitment : ఏపీ(AP) లో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వైసీపీ(YCP) ప్రభుత్వం గత బుధవారం(ఫిబ్రవరి 7) డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి(ఫిబ్రవరి 12) నుంచి మొదలుకానుంది. మొత్తం 6,100 ఖాళీల్లో ఎస్జీటీ పోస్టులు 2,280, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,299, టీజీటీ పోస్టులు 1, 264, పీజీటీ పోస్టులు 215 ఉన్నాయి.
ఫిబ్రవరి 12(ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 22. పరీక్ష మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్లలో (ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు) నిర్వహిస్తారు.
గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు:
--> ఫిబ్రవరి 12 తేదీ నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ..
--> టెట్ పరీక్ష(TET Exam) ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు
--> మార్చి 5న హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్
--> మార్చి 14న టెట్ రిజల్ట్
--> మార్చి 15 నుంచి మార్చి 30 వరకు డీఎస్సీ పరీక్షలు
--> మార్చి 31న డీఎస్సీ ప్రాధమిక కీ విడుదల
--> ఏప్రిల్ 2న ఫైనల్ కీ
--> ఏప్రిల్ 7న ఫలితాల ప్రకటన
--> అన్ని యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలలోని ఖాళీలను భర్తీ
--> 6100 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం
--> ఫిబ్రవరి 12 తేదీ నుంచి ప్రక్రియ మొదలై ఏప్రిల్ 7 తేదీన ఫలితాలు వెల్లడి..
--> 2280 ఎస్జీటీ పోస్టులను
--> 2299 స్కూల్ అసిస్టెంట్ లు
--> 1264 టీజీటి .
--> 215 పిజిటి లు
--> 242 ప్రిన్సిపాల్ నియామకం
12 ఏళ్ళ క్రితం తొలగించిన అప్రెంటీస్‌షిప్(Apprenticeship) విధానాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రకారం డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్ళపాటూ గౌరవవేతనానికి పని చేయాల్సి ఉంటుంది. అప్రెంటీస్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలను పాటించకపోతే వారి అప్రెంటీస్‌షిప్‌ను పొడిగిస్తారు. అలాగే ఈసారి డీఎస్సీ, టెట్ (TET) ఎగ్జామ్స్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా(Computer Based Exam) నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏపీ విద్యాశాఖ టీసీఎస్‌తో(TCS) ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సమాచారం.
Also Read: ఇండియన్ ఆర్మీ భారీ రిక్రూట్‌మెంట్.. 25వేల జాబ్స్‌కు నోటిఫికేషన్!
WATCH: