Pawan Kalyan: తెలంగాణ రాజకీయాలపై పవన్ సంచలన ప్రకటన తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలోనూ బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని అన్నారు. జనసేన ఎఫక్ట్ తెలంగాణలో ఉంటుందని తెలిపారు. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకొని పోటీ చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 29 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Pawan Kalyan: తెలంగాణ రాజకీయాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలోనూ బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని అన్నారు. జనసేన ఎఫక్ట్ తెలంగాణలో ఉంటుందని తెలిపారు. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకొని పోటీ చేసిన సంగతి తెలిసిందే. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కలేదు. ఎన్నికల అనంతరం ఎంపీ ఎన్నికల్లో కూడా పొత్తు ఉంటుందని అందరు అనుకోగా.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవడం లేదని వెల్లడించారు. ఎంపీ ఎన్నికల్లో జనసేన తెలంగాణలో పోటీ చేయలేదు. డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టుకు.. కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. తుర్కపల్లి దగ్గర పవన్ కు ఘనస్వాగతం పలికారు జనసేన, బీజేపీ కార్యకర్తలు, ఫ్యాన్స్. దారిపొడవునా కారుపైకెక్కి అభిమానులకు అభివాదం చేశారు పవన్. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టుకు పవన్ వెళ్లనున్నారు. 11రోజుల వారాహి దీక్షలో ఉన్న పవన్..తొలిసారిగా కొండగట్టు అంజన్న దర్శనం చేసుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎన్నికలకు ముందు వారాహి వాహనానికి కొండగట్టులో పూజలు చేశారు. అక్కడి నుంచే వారాహి విజయయాత్ర ప్రారంభించారు. #pawan-kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి