Pawan Kalyan: 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన ఆదేశాలు!

AP: ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, విధి విధానాలపై పవన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

New Update
Pawan Kalyan: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న పిఠాపురం ఎమ్మెల్యే!

Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని అన్నారు. ఉపాధి హామీ పథకం పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టవచ్చని చెప్పారు.

ఈ పథకం ద్వారా రూ. వేల కోట్లు నిధులు వెచ్చిస్తున్నాం అని పేర్కొన్నారు. ప్రతీ రూపాయిని బాధ్యతతో వ్యయం చేయాలని అన్నారు. ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలన్నారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనులు అమలులో బాధ్యత తీసుకోవాలని సూచించారు. సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో సచివాలయం నుంచి పి.ఆర్. & ఆర్.డి. ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 26 జిల్లాల నుంచి జడ్పీ సీఈవోలు, డి.పి.ఓ.లు, డ్వామా పీడీలు, మండలాల్లో ఎంపీడీఓలు, ఈవో పిఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఏపీఓలు పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు