Pithapuram: ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం నుంచి బుధవారం వరకూ మూడురోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా వారాహి సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. పవన్‌కు ఘన స్వాగతం పలికేందుకు జనసైనికులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశా.
3 రోజుల పర్యటన వివరాలు:
జూలై 1:
* ఉదయం 10 గంటలకు గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం.
* మధ్యాహ్నం చేబ్రోలు నివాసంలో పిఠాపురం జనసేన నాయకులతో సమావేశం.
జూలై 2:
* కాకినాడ కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పంచాయతీ, అటవీ కీలక శాఖలపై సమీక్షా సమావేశం
* మధ్యాహ్నం జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
జూలై 3:
* ఉప్పాడ, యు.కొత్తపల్లిలో క్షేత్ర పర్యటన.
* మధ్యాహ్నం టీడీపీ, బీజేపీ కీలక నేతలతో భేటీ.
* సాయంత్రం 4 గంటలకు పిఠాపురంలో బహిరంగ సభ & హెలికాప్టర్‌లో విజయవాడకు రిటర్న్..!