స్కిల్ డవలప్మెంట్ కేసును సీబీఐతో విచారణ చేయించాలని తాను హైకోర్టును (AP High Court) ఆశ్రయించడంలో తప్పేంటని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (AP Ex MP Undavalli Arun) అన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. సీబీఐ విచారణ విషయంలో టీడీపీ మాజీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీబీఐ విచారణ అడిగితే నేను వైసీపీకి అనుకూలంగా మారానని అంటారా? అని ప్రశ్నించారు. గతంలో పోలవరం, పట్టిసీమ విషయంలో కూడా కోర్టుకు వెళ్లానని గుర్తు చేశారు. 17A చంద్రబాబుకు ఇప్పుడు వర్తిస్తే.. రేపు అది జగన్ కు వర్తిస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu Case: చంద్రబాబుకు జగన్ సర్కార్ మరో భారీ షాక్.. స్కిల్ డవలప్మెంట్ కేసు సీబీఐకి?
చంద్రబాబుకు స్కిన్ అలర్జీ ఉంటే.. కోర్టు ద్వారానో.. ప్రభుత్వాన్ని అడిగి ఏసీ వేయమని అడగాలని సూచించారు. చంద్రబాబు కు సౌకర్యాలు కల్పించాలన్నారు. అవసరం అయితే ఆ ఖర్చు వారి నుంచే వసూలు చేయాలని సూచించారు. గతంలో టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు జైల్ కు వెళ్లినప్పుడు లోపల అన్నీ బాగున్నాయని తనతోనే చెప్పినట్లు ఉండవల్లి అన్నారు. ఉండవల్లి ప్రెస్ మీట్ ను ఈ క్రింది వీడియోలో చూడండి