CM Jagan: పవన్ ప్యాకేజీ స్టార్.. చంద్రబాబుకు ఏపీలో ఇల్లే లేదు: సీఎం జగన్ విమర్శల వర్షం

చంద్రబాబుకు ఏపీలో ఇల్లు కూడా లేదని ఏపీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. ఆయన నెల రోజుల పాటూ ఎప్పుడు రాష్ట్రంలో లేడని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ రోజు పెద్దాపురంలో జరిగిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న జగన్ ఈ వాఖ్యలు చేశారు.

New Update
CM Jagan: పవన్ ప్యాకేజీ స్టార్.. చంద్రబాబుకు ఏపీలో ఇల్లే లేదు: సీఎం జగన్ విమర్శల వర్షం

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇల్లు నిర్మించిస్తుంటే.. చంద్రబాబు కోర్టులో కేసులు వేసి ఆపే ప్రయత్నం చేశారని సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు (Chandrababu Naidu) ఇల్లు కూడా కట్టుకోలేదన్నారు. చంద్రబాబు ఒక నెలరోజుల పాటు ఎప్పుడైనా ఏపీలో ఉన్నారా అంటూ ప్రశ్నించారు జగన్‌. ఇప్పుడు మాత్రమే రాజమండ్రిలో కనిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పెద్దాపురంలో ఈ రోజు సామూహిక గృహప్రవేశాలను జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 22 లక్షల గృహాల నిర్మాణం జరుగుతోందన్నారు. 17వేల వైయస్సార్ జగనన్న కాలనీలు వస్తున్నాయన్నారు. ఇప్పటికే 7:43 లక్షల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. ఆయన రాష్ట్రంలో ఉండరు.. ఆయన దత్త పుత్రుడు కూడా రాష్ట్రంలో ఉండరంటూ ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: AP News: అమిత్‌షాను లోకేష్ కలిసింది అందుకే.. అచ్చెన్నాయుడు సంచలన వాఖ్యలు

దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్లో ఉన్నా.. ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతీ మూడేళ్లకు మారిపోతుంటారని సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివాహ వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ కు గౌరవం లేదన్నారు. నాయకులుగా మన వివాహ వ్యవస్థను, మహిళలను గౌరవించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ప్యాకేజీ స్టార్ భీమవరం, గాజువాకలో ఓడిపోయిన తర్వాత ఆ ప్రాంతాలను పట్టించుకోలేదన్నారు. యూస్ అండ్ త్రో అన్నది పవన్ కళ్యాణ్ పాలసీ అంటూ ధ్వజమెత్తారు.

అభిమానులు ఓట్లు హోల్సేల్ గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు పవన్ వస్తుంటారంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. సొంత పార్టీ, సొంత వర్గాన్ని అమ్ముకునే వ్యాపారి పవన్ కళ్యాణ్ అంటూ విమర్శల వర్షం కురిపించారు. ఆయన షూటింగ్ మధ్య విరామంలో ఏపీకి వచ్చి పోతుంటారన్నారు. రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలన్నారు. రాజకీయం అంటే మరణించినా.. ప్రజల గుండెల్లో నిలిచిపోవడం అని అన్నారు.

Advertisment
తాజా కథనాలు