YCP MP Final List: వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌ ఫైనల్‌ చేసిన అధిష్టానం! ఎవరెవరున్నారంటే..?

వైసీపీ ఎంపీ అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. కొందరు సిట్టింగ్‌లను మార్చినట్లు తెలుస్తోంది. మరి కొంతమంది ఎంపీలకు ఎమ్మెల్యేలుగా ఛాన్స్‌ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అభ్యర్థుల పేర్లు తెలియాలంటే ఆర్టికల్ మొత్తం చదవండి.

New Update
YCP MP Final List: వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌ ఫైనల్‌ చేసిన అధిష్టానం! ఎవరెవరున్నారంటే..?

YCP MP Final List: గత ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకు గాను 22 ఎంపీలను గెలుచుకుంది అధికార పార్టీ వైసీపీ. ఈ సారి కూడా అదే రికార్డ్ స్థాయిలో గెలిచేందుకు మార్పులు చేర్పులు చేస్తోంది. దాదాపు ఎంపీ అభ్యర్థుల పేర్లును అధిష్టానం ఖరారు చేసింది. కొందరు సిట్టింగ్‌లను మార్చిన వైసీపీ..కొంతమంది ఎంపీలకు ఎమ్మెల్యేలుగా ఛాన్స్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఫైనల్‌ లిస్ట్‌ లో ఎవరెవరున్నారంటే..?

వైసీపీ ఎంపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్‌..!

విజయనగరం ఎంపీ అభ్యర్థిగా మజ్జి శ్రీనివాస్
అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కిలారు పద్మ
కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చలమ శెట్టి సునీల్
రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా డైరెక్టర్ వి.వి.వినాయక్
నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఖాద‌ర్ బాషా లేదా అలీలకు ఛాన్స్‌

Also Read: టీడీపీ ఏకపక్షంగా అభ్యర్ధులను ప్రకటించడం సరికాదు.. పవన్ కళ్యాణ్ సీరియస్..!

అటు..ఇటుగా..

ఒంగోలు అభ్యర్థిగా మాగుంట‌ శ్రీనివాసులు రెడ్డి లేదా..వైవీ సుబ్బారెడ్డి ఫ్యామిలీ నుంచి ఒకరికి టిక్కెట్ ఇచ్చే ఛాన్స్‌ కనిపిస్తోంది. రాజమండ్రి ఎంపీ భరత్‌కు ఎమ్మెల్యేగా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమలాపురంలో సిట్టింగ్‌ ఎంపీ చింతా అనురాధను మార్చనున్నట్లు కనిపిస్తోంది. అమలాపురం నుంచి ఉన్నమట్ల ఎలిజాకు అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా న‌ర‌సాపురం, మ‌చిలీప‌ట్నం స్థానాల‌పై ఉత్కంఠ‌ నెలకొంది. ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇంకా ఫైనల్‌ కానట్లు తెలుస్తోంది. నంద్యాల లేదంటే గుంటూరు నుంచి మైనార్టీలకు అవకాశం ఉన్నట్లు సమాచారం. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా..నాగార్జున యాదవ్ లేదా అనిల్ కుమార్ యాదవ్ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు