Jagan : గవర్నర్ కు రాజీనామా లేఖ పంపిన ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ కొద్దిసేపటికి క్రితం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది. 135 సీట్లతో భారీ విజయం సాధించిన టీడీపీ కూటమి వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది.

New Update
Jagan: 'జగన్ బాయ్ బాయ్'.. మాజీ ముఖ్యమంత్రికి చేదు అనుభవం..!

AP : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) వైసీపీ (YCP) ఘోర పరాజయం పొందింది. 135 సీట్లతో భారీ విజయం సాధించిన టీడీపీ కూటమి (TDP Alliance) వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది. దీంతో జగన్ కొద్దిసేపటికి క్రితం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు.

ఇక దీనికంటే ముందు మీడియాతో మాట్లాడిన జగన్ (YS Jagan).. ఈ ఎన్నికలు ఆశ్చర్యంగా ఉన్నాయన్నారు. ఈ ఫలితాలను ఊహించలేదని, అనేక పథకాల ద్వారా పేదలకు చేయూతనిచ్చినా వారి ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదన్నారు. కోట్లమందికి మంచి చేశాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ మాదిరిగా భావించి 99 శాతం హమీలను అమలు చేశాం. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం కోసం అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మహిళాసాధికారత, సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత ఆ అభిమానం, ఆ ఆప్యాయత తెలియదన్నారు. ఎవరో మోసం చేశారు.. అన్యాయం చేశారని అనొచ్చు. కానీ ఆధారాలు లేవు. పేదల పక్షాన ఉంటామంటూ భావోద్వేగానికి గురయ్యారు.

ఇక చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు వాళ్ల గొప్ప విజయానికి అభినందలు తెలిపారు. నా ప్రతీ కష్టంలో తోడుగా, అండగా ఉన్న ప్రతీ నాయకుడు, కార్యకర్త, వాలంటీర్ కు, అక్కాచెళ్లెమ్మలు, అన్నాదమ్ములకు ధన్యవాదాలు తెలిపారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఏమి చేసినా ఎంత చేసినా 40 శాతం ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారన్నారు. గుండె ధైర్యంతో లేస్తాం అన్నారు. పోరాటాలు తనకు కొత్త కాదన్నారు. రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలను అనుభవించాన్నారు.

Also Read : ప్రతి ఒక్కరు పవన్‌ ని కుటుంబ సభ్యుడనుకోవాలి!

Advertisment
Advertisment
తాజా కథనాలు