ఎన్నికల ఆశ్చర్యంగా ఉన్నాయన్నారు జగన్. ఇలాంటి ఫలితాలను ఊహించలేదన్నారు. అనేక పథకాల ద్వారా పేదలకు చేయూతనిచ్చామన్నారు. వారి ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదన్నారు. కోట్లమందికి మంచి చేశామన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ మాదిరిగా భావించి 99 శాతం హమీలను అమలు చేశామన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం కోసం అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. మహిళాసాధికారత, సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగామన్నారు. ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత ఆ అభిమానం, ఆ ఆప్యాయత తెలియదన్నారు.
ఎవరో మోసం చేశారు, అన్యాయం చేశారని అనొచ్చు కానీ ఆధారాలు లేవన్నారు. పేదల పక్షాన ఉంటామంటూ భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు వాళ్ల గొప్ప విజయానికి అభినందలు అని అన్నారు. నా ప్రతీ కష్టంలో తోడుగా, అండగా ఉన్న ప్రతీ నాయకుడు, కార్యకర్త, వాలంటీర్ కు, అక్కాచెళ్లెమ్మలు, అన్నాదమ్ములకు ధన్యవాదాలు తెలిపారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఏమి చేసినా ఎంత చేసినా 40 శాతం ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారన్నారు. గుండె ధైర్యంతో లేస్తాం అన్నారు. పోరాటాలు తనకు కొత్త కాదన్నారు. రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలను అనుభవించాన్నారు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ కష్టాలు పెట్టినా ఎదుర్కొంటామన్నారు.