Vizag Infosys :విశాఖలో జగన్‌ ప్రారంభించే ఇన్ఫోసిస్‌ లో ఎంతమంది ఉద్యోగులు అంటే!

ఏపీ (AP) లో దసరా (Dussera) నుంచి విశాఖ పట్నం (VIzag)  వేదికగా పరిపాలన సాగిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ (Jagan) ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అందరి దృష్టి కూడా విశాఖ మీదే ఉంది.ఈ క్రమంలోనే జగన్ సోమవారం ఉదయం ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ ను లాంఛనంగా ప్రారంభించారు.

New Update
YS Jagan: కుట్రలు చేస్తారు.. కుటుంబాలను చీలుస్తారు: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Vizag Infosys: ఏపీ లో దసరా (Dussehra) నుంచి విశాఖ పట్నం (Vizag)  వేదికగా పరిపాలన సాగిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ (CM Jagan) ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అందరి దృష్టి కూడా విశాఖ మీదే ఉంది.ఈ క్రమంలోనే జగన్ సోమవారం ఉదయం ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada amarnath) కూడా పాల్గొన్నారు.

రానున్న రోజుల్లో విశాఖ రాజధానిగా పరిపాలన సాగిస్తుందనే తరుణంలో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలు ఒక్కొక్కటిగా నగరంలో కొలువు అవుతున్నాయి,. క్రమంగా విశాఖపట్నం.. రాజధాని కళను పుణికిపుచ్చుకుంటోంది. కొంతకాలం కిందటే జగన్‌ వైజాగ్‌ లో అదానీ సెంటర్‌ కు భూమి పూజ కూడా చేశారు.

Also read: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..ఆ సంస్థలో భారీగా ఉద్యోగాలు!

అదాని సారథ్యంలోని అదాని (Adani) గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ ఈ డేటా సెంటర్‌ ను నెలకొల్పనున్నాయి. దీనిని 21,800 కోట్లతో ఈ డేటా సంఎటర్‌ ను ఏర్పాటు అవుతుంది. ఈ కంపెనీ వల్ల సుమారు 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ గా ఇది నిర్మాణం కాబోతుంది.

తాజాగా దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) కూడా విశాఖను వెతుక్కుంటూ వచ్చి చేరింది. తన కార్యకలాపాలను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకుంది. సుమారు 35 కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతుంది. రుషికొండ సమీపంలో ఐటీ సెజ్‌ ఈ సెంటర్ ఏర్పాటైంది. ముందుగా 1000 మంది ఉద్యోగులతో ఈ సంస్థ తన కార్యకలాపాలతో పనులు ప్రారంభించనుంది.

హైబ్రీడ్ వర్క్‌ ప్లేస్‌ గా రూపొందించడం ఈ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ ప్రత్యేకత. ఈ సెంటర్‌ ను ప్రారంభించిన తరువాత అనకాపల్లి బయల్దేరి వెళ్తారు. పరవాడ ఫార్మా సిటీలో యూజియా స్టెరిల్స్‌ ప్రెవైట్‌ లిమిటెడ్‌ యూనిట్‌ ను ప్రారంభిస్తారు. 400 కోట్ల రూపాయలతో ఈ యూనిట్‌ ను ఏర్పాటైంది.యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇంగ్రేడియంట్‌ యూనిట్‌ను ఆయన ప్రారంభిస్తారు. 422 కోట్ల రూపాయలతో అచ్యుతాపురంలో ఈ యూనిట్ ఏర్పాటైంది.

Also Read: త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతా-ఏపీ సీఎం జగన్

Advertisment
తాజా కథనాలు