/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/CM-KCR-Jagan-jpg.webp)
ఇటీవల ఎడమ తుంటికి ఆపరేషన్ కావడంతో విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను (KCR) ఏపీ సీఎం జగన్ (KCR) కొద్ది సేపటి క్రితం పరామర్శించారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్ కు బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy), ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) స్వాగతం పలికారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి వచ్చారు జగన్. అనంతరం కేసీఆర్ ను ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌తో కలిసి జగన్ లంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Breaking news: కాంగ్రెస్ లో చేరిన షర్మిల.. ఏపీలో హస్తం పార్టీని అధికారంలోకి తెస్తానని ప్రకటన!
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-04-at-12.28.54-PM-jpeg.webp)
ఈ రోజు జగన్ సోదరి షర్మిల తన వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్, కేసీఆర్ భేటీ ప్రాధానత్య సంతరించుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్, కేసీఆర్ తొలిసారి కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలు కూడా వీరి చర్చించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.