CM Chandrababu: నేడు హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు

AP: ఈరోజు సీఎం హోదాలో తొలిసారి తెలంగాణకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. రాత్రి హైదరాబాద్‌లోనే బస చేస్తారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు.

AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు!
New Update

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.ఈరోజు కూడా కేంద్ర పెద్దలను చంద్రబాబు కలవనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు (Hyderabad) చేరుకుంటారు. రాత్రి హైదరాబాదులోనే బస చేయనున్నారు. రేపు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (Revanth Reddy) సమావేశం కానున్నారు. విభజన సమస్యలపై చర్చించనున్నారు. కాగా సీఎం హోదాలో చంద్రబాబు తెలంగాణకు రావడం ఇదే తొలిసారి. చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో టీడీపీ శ్రేణులు భారీ ఫ్లెక్సులు ఏర్పాటు చేశారు. కాగా చంద్రబాబు రాక తెలంగాణ టీడీపీ క్యాడర్ లో ఉత్సహాన్ని నింపింది.

Also Read: బీఆర్‌ఎస్‌ కు భారీ షాక్.. ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి

#cm-chandrababu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి