/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu-3-1.jpg)
CM Chandrababu Naidu:సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.ఈరోజు కూడా కేంద్ర పెద్దలను చంద్రబాబు కలవనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు (Hyderabad) చేరుకుంటారు. రాత్రి హైదరాబాదులోనే బస చేయనున్నారు. రేపు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (Revanth Reddy) సమావేశం కానున్నారు. విభజన సమస్యలపై చర్చించనున్నారు. కాగా సీఎం హోదాలో చంద్రబాబు తెలంగాణకు రావడం ఇదే తొలిసారి. చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో టీడీపీ శ్రేణులు భారీ ఫ్లెక్సులు ఏర్పాటు చేశారు. కాగా చంద్రబాబు రాక తెలంగాణ టీడీపీ క్యాడర్ లో ఉత్సహాన్ని నింపింది.
Also Read: బీఆర్‌ఎస్ కు భారీ షాక్.. ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి