AP CM Chandrababu Naidu : అది ఏపీ అసెంబ్లీ (AP Assembly) నవంబర్ 19 , 2021... ప్రతిపక్షానికి , అధికార పక్షానికి మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. నాటి అధికార పక్షం తన కుటుంబ సభ్యుల పై దారుణ వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అధికార పక్షం ఆయన ఆవేదనను పట్టించుకోలేదు సరికాదా ఆయనను హేళన చేసి మాట్లాడారని టీడీపీ వారు ఆరోపించారు.
దీంతో చంద్రబాబు నాయుడు ఆనాడు ఈ సభలో అడుగుపెడితే .. సీఎంగానే వస్తాను కానీ.. ప్రతిపక్ష నేతగా రాను అంటూ శపథం చేశారు.
ఇది శాసనసభ కాదు.. ఇది కౌరవ సభ.. తిరిగి గౌరవ సభగానే వస్తాను అంటూ అడుగు బయటపెట్టిన బాబు.. మళ్లీ గెలిచి ముఖ్యమంత్రిగా నేడు గర్వంగా సభలో అడుగు పెట్టబోతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో 163(+1) మంది కూటమి సభ్యుల మధ్య సభలోకి అడుగుపెట్టనున్నారు.
Also read: కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య బలవన్మరణం!