Chandrababu Naidu : సీఎం హోదాలో నేడు ఏపీ అసెంబ్లీకి చంద్రబాబు! ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడ్ని శాసన సభలో వైసీపీ ప్రభుత్వం హేళన చేయండంతో 2021 నవంబర్ 19 న మళ్లీ ఈ సభకు ఈ సీఎంగానే అడుగుపెడతానని శపథం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలిచిన ఆయన నేడు సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. By Bhavana 21 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP CM Chandrababu Naidu : అది ఏపీ అసెంబ్లీ (AP Assembly) నవంబర్ 19 , 2021... ప్రతిపక్షానికి , అధికార పక్షానికి మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. నాటి అధికార పక్షం తన కుటుంబ సభ్యుల పై దారుణ వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అధికార పక్షం ఆయన ఆవేదనను పట్టించుకోలేదు సరికాదా ఆయనను హేళన చేసి మాట్లాడారని టీడీపీ వారు ఆరోపించారు. దీంతో చంద్రబాబు నాయుడు ఆనాడు ఈ సభలో అడుగుపెడితే .. సీఎంగానే వస్తాను కానీ.. ప్రతిపక్ష నేతగా రాను అంటూ శపథం చేశారు. ఇది శాసనసభ కాదు.. ఇది కౌరవ సభ.. తిరిగి గౌరవ సభగానే వస్తాను అంటూ అడుగు బయటపెట్టిన బాబు.. మళ్లీ గెలిచి ముఖ్యమంత్రిగా నేడు గర్వంగా సభలో అడుగు పెట్టబోతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో 163(+1) మంది కూటమి సభ్యుల మధ్య సభలోకి అడుగుపెట్టనున్నారు. Also read: కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య బలవన్మరణం! #ap-assembly #tdp #chandrabbau-naidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి