Chandrababu: అవమానం నుంచి అద్భుత విజయం వరకూ.. చంద్రబాబు అలుపెరుగని పోరాటమిదే! 2019లో అధికారం కోల్పోయిన తర్వాత అనేక అవమానాలు ఎదుర్కొన్న చంద్రబాబు.. అలుపెరగని పోరాటం చేసి తాను అనుకున్నది సాధించారు. నేడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అవమానాల నుంచి అధికారం వరకు ఆయన సాగించిన జర్నీపై స్పెషల్ స్టోరీ. By srinivas 12 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Chandrababu Naidu Success Story: 2021 నవంబర్ 19.. చంద్రబాబు నాయుడు తన కుటుంబంపై జరిగిన అవమానానికి జీవితంలో అత్యంత బాధపడిన రోజు. 2024 జూన్ 4న అదే చంద్రబాబు నాయుడు తన ఘనవిజయోత్సవ సంబరాలను కుటుంబంతో కలిసి జరుపుకుంటున్న సందర్భం. ఈ రెండు సంఘటనల మధ్య కాలం 2 సంవత్సరాల 6 నెలల 16 రోజులు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు తన విజయానికి బాటలు ఎలా వేశారు.. టీడీపీకి (TDP) ఘనవిజయాన్ని ఎలా అందించారు.. కష్టాలు, సవాళ్లను తాను ఎలా ఎదుర్కొన్నాడు.. తన రాజకీయ అనుభవంతో ప్రత్యర్థులని ఎలా చిత్తు చేశాడనేది తెలుసుకుందాం. అసెంబ్లీని వదిలి ప్రజల మధ్యకు.. మళ్లీ సీఎం అయిన తార్వతే అసెంబ్లీలో అడుగుపెడతానని అసెంబ్లీని వదిలి ప్రజల మధ్యకు వెళ్లాడు చంద్రబాబు (Chandrababu Naidu). ప్రభుత్వ పనితీరుని ప్రశ్నిస్తూ వారి తప్పులని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న చంద్రబాబును.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9 2023 న నంద్యాలలో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్ కి పంపారు. ఆ అరెస్ట్ ను ప్రశ్నించడానికి హైదరాబాద్ నుండి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రోడ్ మార్గంలో వస్తుండగా పోలీస్ లు రోడ్ పైనే అడ్డుకున్నారు. తండ్రిని కలవడానికి వెళ్లిన నారా లోకేష్ (Nara Lokesh), భువనేశ్వరి, బ్రాహ్మణిలని పోలీస్ లు నిలిపి వేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ లో చంద్రబాబును కలిసిన తర్వాత పవన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కలిసి పోటీ చేస్తుందని ప్రకటించారు. 53 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల.. ఈ క్రమంలోనే 53 రోజుల తర్వాత చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చారు. జగన్ ను గద్దె దించడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నారు. కేంద్రంలో కూడా తనకు బలం చేకూరాలని భావించిన చంద్రబాబు.. గతంలో పొత్తు పెట్టుకున్న ఇండియా కూటమిని కాదనుకొని ఎన్డీఏతో పెట్టుకున్నారు. తన టార్గెట్ జగన్ (YS Jagan) మాత్రమేని ఏ ఒక్క ఓటును కూడా చీల్చ కూడదని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని ఏర్పాటు చేశారు. శత్రువును దెబ్బ కొట్టాలంటే.. ఎలాంటి ఎత్తులు వేయాలో చంద్రబాబుకు బాగా తెలుసు. కూటమిని దెబ్బ తీసేందుకు వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా వాటన్నిటినీ తన రాజకీయ అనుభవం, తెలివితో తిప్పి కొట్టారు. ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా ప్రతి నియోజకవర్గంలో తానే స్వయంగా ప్రజలను కలుస్తూ ధైర్యం నింపారు. ఇదే గొప్ప విజయానికి కారణం అయింది. దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్.. ఇప్పుడు ఎన్డీయే కూటమి విజయానికి మాస్టర్ మైండ్ గా మారి, కేంద్రo, రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ అయ్యాడు చంద్రబాబు. ఎవరైతే పవిత్రమైన అసెంబ్లీలో తన కుటుంబాన్ని అగౌరవ పరిచి అవమానించారో.. వారందరూ చంద్రబాబు ధాటికి దారుణంగా ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. వారందరికీ ఇదే దారుణమైన అవమానం. మరికొన్ని రోజుల్లో అదే సభలో సీఎంగా అడుగుపెట్టనున్నారు. Your browser does not support the video tag. తన కుటుంబానికి జరిగిన అవమానానికి.. ఇతర కుటుంబ సభ్యులంతా చంద్రబాబుకు తోడుగా ఉంటూ టీడీపీ విజయానికి కృషి చేశారు. తాను కుటుంబంగా భావించే ఆంధ్ర ప్రజలంతా తిరిగి అధికారాన్ని అందించారు. ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలని డిసైడ్ చేసే కింగ్ మేకర్ గా చంద్రబాబు మారాడు. ఇది కదా విజయం అంటే.. ఇది కదా అసలైన గెలుపంటే. దేశవ్యాప్తంగానే కాదు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబుపై ప్రశంసలు కురస్తున్నాయి. Also Read: ఏపీ రెవెన్యూ శాఖలో కీలక ఆదేశాలు.. #chandrababu-naidu #success-story మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి