AP Home Minister Anitha: ఫైర్ బ్రాండ్ కు పవర్ ఫుల్ శాఖ.. హోం మంత్రి అనిత బ్యాక్ గ్రౌండ్ ఇదే!

అత్యంత కీలకమైన హోం శాఖను పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కేటాయించారు సీఎం చంద్రబాబు. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై పోరాడి.. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న అనితకు పవర్ ఫుల్ శాఖ దక్కిందన్న చర్చ సాగుతోంది.

New Update
AP Home Minister Anitha: ఫైర్ బ్రాండ్ కు పవర్ ఫుల్ శాఖ.. హోం మంత్రి అనిత బ్యాక్ గ్రౌండ్ ఇదే!

Home Minister Anitha Vangalapudi: ఎట్టకేలకు ఏపీ మంత్రులకు చంద్రబాబు (CM Chandrababu) శాఖలను కేటాయించారు. దీంతో ఈ నెల 12న వారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అయితే.. శాఖల కేటాయింపులో ఊహించని ట్విస్ట్ లు ఇచ్చారు. హోం శాఖను పాయకరావు పేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కేటాయించారు చంద్రబాబు. ఎస్సీ మహిళకు ఈ శాఖ కేటాయించి ఆ వర్గాలకు అగ్రస్థానం ఇచ్చామన్న సంకేతాలను పంపించారు. వాస్తవానికి ఈ శాఖను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కేటాయిస్తారన్న ప్రచారం జరిగింది. అనంతరం అచ్చెన్నాయుడుతో పాటు పలువురి పేర్లను ఈ శాఖ కోసం పరిశీలించారు చంద్రబాబు. చివరికి పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న అనితకు ఈ పవర్ ఫుల్ శాఖను అప్పగించారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదటి రెండున్నరేళ్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు హోంశాఖను అప్పగించారు నాటి సీఎం జగన్. ఆ తర్వాత రెండున్నరేళ్లు కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనితకు హోం శాఖను కేటాయించారు. వీరిద్దరూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే విశేషం. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ సైతం ఎస్సీ మహిళకే హోం శాఖను అప్పగించింది. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రిగా విజయం సాధించిన తర్వాత హోంశాఖను సబితా ఇంద్రారెడ్డికి కేటాయించారు.

ఇక వంగలపూడి అనిత విషయానికి వస్తే.. ఆమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. అయితే.. 2013లో టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2014లో పాయకరావుపేట నుంచి ఆమెను టీడీపీ బరిలోకి దించగా.. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో పార్టీ కూడా ఓటమిపాలైంది. అప్పటి నుంచి అనిత పార్టీలో కీలకంగా మారారు. నాటి మంత్రులు, ముఖ్యంగా రోజాకు కౌంటర్ ఇస్తూ వార్తల్లో నిలిచారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు అనితను తెలుగుమహిళ అధ్యక్షురాలిగా నియమించారు. పార్టీలో కీలకమైన పొలిట్ బ్యూరోలోనూ అనితకు చోటు కల్పించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి అనితను టీడీపీ బరిలోకి దించగా.. 40 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అనంతరం అనితను మంత్రివర్గంలోకి తీసుకున్న చంద్రబాబు కీలకమైన హోంశాఖను అప్పగించారు.

Advertisment
తాజా కథనాలు