Andhra Pradesh: చిక్కుల్లో రోజా, ధర్మాన..విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నిధులను దుర్వినియోగం చేశారంటూ వైసీపీ నేతలు రోజా, ధర్మాన కృష్ణదాస్‌లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. ఏపీ ఆత్యా–పాత్యా సంఘం చేసిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వీరిద్దరి మీద విచారణకు ఆదేశాలు చేసింది. By Manogna alamuru 15 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి RK Roja, Dharmana Krishna Das: వైసీపీ ప్రభుత్వం హయాంలో రోజా, ధర్మాన కృష్ణ దాస్‌లు మంత్రులుగా పని చేశారు. అప్పటి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా అనే క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిని మాజీ మంత్రులు రోజా, ధర్మానలే దగ్గరుండి చూసుకున్నారు. అయితే ఈ మొత్తం కార్యక్రమంలో నిధులు దుర్వినియోగం అవడమే కాక..పక్కదారి కూడా పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్రా, సీఎం కప్ కార్యక్రమాల పేరుతో క్రీడలశాఖ మంత్రిగా పని చేసిన ఆర్కే రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది ఏపీ ఆత్యా–పాత్య సంఘం. దీని మీద సీఐడీ విచారణ కోరింది. ఈఫిర్యాదును పరిగణలోకి తీసుకుని..విచారణ జరపాలని ఎన్టీయార్ జిల్లా సీపీని సీఐడీ ఏడీజీ ఆదేశించింది. దీంతో రోజా, ధర్మాన చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్టు అయింది. Also Read: Fater Of Agni Missile: ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్ రామ్ నరైన్ కన్నుమూత #rk-roja #andhra-paradesh #adudam-andhra #dharmana-krishna-das మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి