AP CEO: 119 స్పెషల్ కమిషనర్స్.. 5గంటల లోపు ఫలితాలు.. ఏపీ సీఈఓ సెన్సేషనల్ కామెంట్స్..!

రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారని వివరించారు.

New Update
AP CEO: 119 స్పెషల్ కమిషనర్స్.. 5గంటల లోపు ఫలితాలు.. ఏపీ సీఈఓ సెన్సేషనల్ కామెంట్స్..!

AP CEO Mukesh Kumar Meena:  ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌కి 454 అభ్యర్థులు, అసెంబ్లీకి 2387 మంది అభ్యర్థులు పోటీ చేశారన్నారు. ఏపీలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని.. అందులో 3.33 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 81.8 పోలింగ్ పర్సంటేజ్ నమోదు అయ్యిందని తెలిపారు. 4.61 లక్షల బ్యాలెట్ ఓటర్లు, 26,721సర్వీస్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు.

స్పెషల్ కమిషనర్స్..

రేపు ఉదయం 8 గంటలకు బ్యాలెట్ కౌంటింగ్ ఉంటుందని, 8.30 నుండి ఈవీఎంల కౌంటింగ్ మొదలు అవుతుందని వెల్లడించారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల కోసం - 2443 ఈవీఎం టేబుల్స్, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ..175 అసెంబ్లీ నియోజకవర్గాల కోసం..2446 ఈవీఎం టేబుల్స్, పోస్టల్ బ్యాలెట్ కోసం 557 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించడానికి 119 స్పెషల్ కమిషనర్స్ నియమించినట్లు వెల్లడించారు.

మైక్రో అబ్జర్వర్స్..

ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, ప్రతి కౌంటింగ్ హల్‌లో ఇద్దరు అదనపు మైక్రో అబ్జర్వర్స్ నియమించామన్నారు. అమలాపురం పార్లమెంట్‌లో అత్యధికంగా 27 రౌండ్స్ ఉంటాయని, ఫలితాలు రావడానికి 9 నుండి 10 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. రాజమండ్రి, నర్సాపురం అత్యల్పంగా 13 రౌండ్స్ ఉంటాయని..5 గంటల లోపు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. భీమీలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా 26 రౌండ్స్ ఉంటాయని.. ఫలితాలు రావడానికి 9 నుండి 10గంటలు పట్టే అవకాశం ఉందని కామెంట్స్ చేశారు. కొవ్వూర్, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యల్పంగా 13 రౌండ్స్ ఉంటాయని 5గంటల లోపు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Also Read: ఏపీలో మారిన లెక్కలు.. గెలిచేది వారే.. రవిప్రకాష్ సంచలన పోస్ట్ పోల్ స్టడీ!

20 లోపు రౌండ్స్ ఉన్న నియోజకవర్గాలు - 111
21 నుండి 24 లోపు రౌండ్స్ ఉన్న నియోజకవర్గాలు - 61
25 పైన రౌండ్స్ ఉన్న నియోజకవర్గాలు - 3
పోస్టల్ బ్యాలెట్స్ కోసం - 102
అసెంబ్లీ స్థానాలకు 102 రౌండ్స్
3 రౌండ్స్ - 48 అసెంబ్లీ
4 రౌండ్స్ - 25 అసెంబ్లీ

RED జోన్..

కౌంటింగ్ రోజును డ్రై డేగా ప్రకటించామని.. కౌంటింగ్ సెంటర్స్ ఉన్న ప్రాంతాలను RED జోన్ గా ప్రకటించామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని..26 జిల్లాలో 1985 సమస్యత్మాక ప్రాంతాలను గుర్తించామని వెల్లడించారు. 175 నియోజకవర్గాల్లో 83 అసెంబ్లీ స్థానాలను సమస్యత్మాక నియోజకవర్గాలుగా గుర్తించినట్లు తెలిపారు. 83 సమస్యత్మాక అసెంబ్లీ స్థానాల్లో పర్యవేక్షణ కోసం ఉన్నతస్థాయి అధికారులను నియమించినట్లు వెల్లడించారు.

1 - ADGP
2 - IGP
2 -DIG
11- SP
26 - ADDL. SP
79 -DSP
206 - SI
228 - SUB INSPECTORS

Advertisment
తాజా కథనాలు