ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసిన ఏపీ సీఈవో

ఏపీలో రానున్న ఎన్నికల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. చనిపోయిన వారి ఓటర్లను తొలగించి, కొత్త ఓటర్లను చేర్చడానికి ఇంటింటికి వెళ్లి సర్వే చేయడానికి రంగం సిద్ధమైంది. ఈసీ నియమించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు.

New Update
ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసిన ఏపీ సీఈవో

AP CEO meets Election Commission in Delhi

ఓటర్ల జాబితాపై చర్చ

ఏపీ చీఫ్ ఎలక్టోరల్‌ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. డిప్యూటీ కమిషనర్‌తో దాదాపు 3 గంటల పాటు ఆయన భేటీ అయ్యారు. ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్‌పై చర్చించారు. ఈనెల 20న ఏపీలో రాజకీయ పార్టీలతో ముఖేష్ కుమార్ మీనా సమావేశం కానున్నారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను తనిఖీ చేయనున్నారు. కొత్త ఓటర్లను చేర్చుకోవడం, చనిపోయిన వారిని తొలగించడం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇంటింటికి వెళ్లే ఈసీ బృందంలో ఆయా రాజకీయ పార్టీలు ఏజెంటును నియమించుకునే అవకాశం ఉంది.

త్వరలో ఓటర్ కార్డులు

వచ్చే నెల 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఏపీలో వీఆర్వోల నియామకం, ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పరిశీలించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 100% ఓటరు కార్డుల ముద్రణ పూర్తి కాగా.. కొత్త ఓటర్లకు సాధ్యమైనంత త్వరగా ఓటర్ కార్డులను ఇచ్చేందుకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ప్రయత్నిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు