BREAKING: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు

AP: రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సెబ్ ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖ పునర్ వ్యవస్థీకరణకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 2, 774 కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రభుత్వ చిహ్నంతో 21.86లక్షల పాస్ పుస్తకాలు అందించనుంది.

BREAKING: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు
New Update

AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గం భేటీ అయింది. ఈ భేటీలో రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్ ఫొటోలతో ఉన్న భూమి పాస్ పుస్తకాలను తొలిగించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఆ పాస్ పుస్తకాల బదులుగా రాష్ట్ర ప్రభుత్వం చిహ్నంతో ఉన్న 21.86లక్షల పాస్ పుస్తకాలను లబ్ధి దారులకు అందించనుంది. 22ఏ భూముల వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వివాదాస్పద భూముల రిజిష్రేషన్ల నిలిపివేతకు ఆమోదం తెలిపింది. 77లక్షల సర్వే రాళ్లపై జగన్ బొమ్మను తొలిగించేందుకు నిర్ణయం తీసుకుంది. సాగునీటి సంఘాల ఎన్నికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సెబ్‌ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖ పునర్ వ్యవస్థీకరణకు, రివర్స్ టెండరింగ్ విధానం రద్దుకు ఆమోదం తెలిపింది. మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా 2, 774 కొత్త రేషన్ షాపుల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే కొత్తగా ఏర్పాటు చేసే రేషన్ షాపులలో EPOS మెషీన్లను ఏర్పాటు చేయనుంది. EPOS మెషీన్ల కొనుగోలు కొరకు రూ.11.51లక్షల కోట్ల నిధులు కేటాయించనుంది. పోలవరం ఎడమ కాల్వ పనులు పునురుద్ధరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

#ap-cabinet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe