AP Cabinet: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం?

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమైంది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హత నిబంధన రద్దు, నూతన మద్యం పాలసీ తదితర అంశాలపై మంత్రి వర్గం చర్చించనున్నట్లు సమాచారం.

New Update
AP: ఏపీ కేబినెట్ సమావేశం.. ఈ అంశాలపై కీలక చర్చ..!

AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనలను రద్దు చేసే అంశంపై కేబినెట్ లో చర్చ జరగనున్నట్లు సమాచారం. మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖల్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

నూతన మద్యం విధానం తెచ్చే విషయంలో ప్రతిపాదనలపై చర్చ జరిగే అవకాశం ఉంది. మద్యం నూతన విధానం ఆదాయ ఆర్జన కోణంలో కాకుండా... అక్రమాలకు అవకాశం లేకుండా ఉండేలా తేవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.  2014 -19, 2019-24 మధ్య కాలంలో వచ్చిన ఎక్సైజ్ పాలసీలపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి, ఇసుక పాలసీ, ఎన్నికల హామీల అమలు వంటి అంశాలను నేటి కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు