AP Cabinet: రేపు ఏపీ కేబినెట్‌ భేటీ.. పలు పథకాలకు ఆమోదం!

రేపు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం జరగనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

AP Cabinet: రేపు ఏపీ కేబినెట్‌ భేటీ.. పలు పథకాలకు ఆమోదం!
New Update

AP Cabinet: రేపు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం జరగనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది శాఖలపై శ్వేతపత్రాల విడుదలపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీ ఆర్ధికపరిస్థితిపై ప్రత్యేకంగా మంత్రివర్గం చర్చించనుంది. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టే అంశంపై కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం.

నెలరోజుల్లో అమలు చేస్తాం..

ఇటీవల ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నెలరోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. 15 రోజుల్లోగా కమిటీని వేసి, పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధ్యయనం జరుపుతామన్నారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం నెలరోజుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని అన్నారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 5 కీలక ఫైళ్లు.. మెగా డీఎస్సీ (Mega DSC), అన్నక్యాంటీన్లు, సామాజిక పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, నైపుణ్య గణనపై సంతకాలు చేశారు. ఈ సమావేశంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

#ap-cabinet
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe