AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం ఈరోజు ఏపీ కేబినెట్ కీలక భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 07 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి AP Cabinet: ఈరోజు ఏపీ కేబినెట్ కీలక భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి అభివృద్ధికి పెద్దపీట పడింది. రాష్ట్ర అభివృద్ధి కొరకు రూ.15000 కోట్లను ప్రత్యేక నిధి కింద కేంద్రం మంజూరు చేసింది. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొంది. నిర్మాణ పనులకు శ్రీకారం.. అమరావతి (Amaravati) నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు (CM Chandrababu) సర్కార్. అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ముళ్లకంపల తొలగింపును ప్రారంభించనున్నారు మంత్రి నారాయణ. సచివాలయం వెనుక ఎన్ 9 రోడ్డు నుంచి పనులు ప్రారంభిస్తారు. రాజధాని ప్రాంతంలో 5 ఏళ్ల కాలంగా పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. 3 నెలల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు అధికారులు. అక్టోబర్ నెలాఖరు నుండి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. Also Read : నేడు వైసీపీకి రాజీనామా చేయనున్న మాజీ ఎమ్మెల్యే #ap-cabinet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి