ఈనెల12న ఏపీ కేబినెట్ మీటింగ్

ఏపీ ప్రభుత్వం జూలై 12న క్యాబినెట్ సమావేశానికి పిలుపునచ్చింది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో జరిగే ఈ క్యాబినేట్ సమావేశంలో సీఎం జగన్ పలు విషయాలపై మంత్రులతో చర్చించనున్నారు. సీఎం నేతృత్వంలో జరిగే క్యాబినెట్ మీటింగ్.. ప్రధానంగా కీలక ఆంశాలపై చర్చించబోతున్నట్లు సమాచారం.

New Update
ఈనెల12న ఏపీ కేబినెట్ మీటింగ్

AP cabinet meeting on 12th of this month

సీక్రెట్‌గానే కేబినెట్ నిర్ణయాలు

సీఎంజగన్‌ ఏదో చేయాలనుకుంటున్నారు కానీ ధైర్యం చాలడం లేదన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఢిల్లీ పర్యటనకు వెళ్లి కేంద్రమంత్రులు, ప్రధానితో భేటీ అయి వచ్చి న తర్వాత మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఏం నిర్ణయాలు తీసుకుంటారన్నది మాత్రం స్పష్టత ఉండటం లేదు. కేబినెట్ నిర్ణయాలు కూడా చాలా వరకూ సీక్రెట్‌గానే ఉంటున్నాయి. ఆస్తులు తాకట్టుపెట్టడం, ఇతరులకు కేటాయించడం వంటివి చివరి క్షణం వరకూ బయటకు రావడం లేదు.

ఎన్నికలకు వెళ్లే దిశగా సంకేతాలు

అయితే.. కావాలనుకున్నవి మాత్రం లీక్ చేస్తున్నారు. గత ఢిల్లీ పర్యటన తర్వాత కూడా సీఎం కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. అప్పట్లోనే తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లే దిశగా సంకేతాలు ఇస్తారేమో అనుకున్నారు. కానీ ఇవ్వలేదు. అయితే ఏపీలో మాత్రం ఆయన బీజేపీతో అవగాహనకు ఇప్పటికే వచ్చారని.. ఆగస్టులో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పెట్టేలా చూసుకున్నారని అంటున్నారు. ఈ విషయంపై తనకు స్పష్టత ఉందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా చాలా సార్లు ప్రకటించారు.

అదనపు అప్పులకు పర్మిషన్లు

ఈ ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పుల పరిమితికి దాదాపుగా ముగిసింది. వచ్చే నెల నుంచి జీతాలివ్వడం మరింత కష్టం కావొచ్చు. ఇక పథకాలకు బటన్లు నొక్కాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ ఆస్తులు తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే కేంద్రం అదనపు అప్పులకు పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటివి లేకపోతే వచ్చే ఎన్నికల ముందు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటారు. అందుకే ఇప్పుడే ఎన్నికలకు వెళ్లడం మంచిదన్న అభిప్రాయానికి వస్తున్నారు. ఏం నిర్ణయం తీసుకుంటుదో కేబినెట్ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు