AP Cabinet Meet: ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ భేటీ.. ఆ చట్టం రద్దుకు ఆమోదం!

ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని క్యాబినెట్ లో నిర్ణయించారు. భూముల రీ సర్వేలను కూడా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

New Update
AP Cabinet Meet: ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ భేటీ.. ఆ చట్టం రద్దుకు ఆమోదం!

AP Cabinet Meet: ఏపీలో క్యాబినెట్ మీటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన మీటింగ్ కొనసాగుతోంది. క్యాబినెట్ భేటీలో ఏపీలోని భూయజమానులు గుడ్ న్యూస్ వచ్చింది. వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titling Act) రద్దు చందాయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా భూముల రీ సర్వేలు నిలిపివేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. గత వైసీపీ హయాంలో ఈ రెండు విధానాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కీలక ఎజెండాగా మారింది. అప్పటి ఎన్నికల ప్రచారంలో ఈ యాక్ట్ ను రద్దు చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం ఇప్పుడు యాక్ట్ రద్దు చేయడానికి ఇకేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

Also Read: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు…హోం మినిస్టర్‌ తో భేటీ!

మరిన్ని క్యాబినెట్ మీట్ విశేషాలు అప్ డేట్ అవుతున్నాయి.. 

Advertisment
Advertisment
తాజా కథనాలు