AP Breaking: మరో కీలక పోలీస్ అధికారిపై ఈసీ వేటు

నిన్న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఈసీ.. తాజాగా మరో కీలక అధికారిపై చర్యలు తీసుకుంది. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఎన్నికలు ముగిసే వరకు ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వొద్దని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది.

AP Breaking: మరో కీలక పోలీస్ అధికారిపై ఈసీ వేటు
New Update

EC Transfers Anantapur DIG Ammireddy: ఏపీలో మరో అధికారిపై ఈసీ వేటు వేసింది. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. అమ్మిరెడ్డికి ఎన్నికల విధులు అప్పగించొద్దని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అధికార పార్టీకి సహకరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుతోనే అధికారులపై వరుసగా బదిలీ వేటు పడుతున్నట్లు తెలుస్తోంది. నిన్న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP Rajendranath Reddy) పై ఈసీ బదిలీ వేటు వేసింది. ఎన్నికలకు సంబంధించిన విధులను ఆయనకు అప్పగించవద్దని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది ఈసీ.
ఇది కూడా చదవండి: AP Elections 2024 : కళ్యాణదుర్గంలో టెన్షన్‌ టెన్షన్.. అమ్మకానికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు?

ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు రాష్ట్ర పోలీస్ బాస్ పై వేటు వేయడం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ రోజు సాయంత్రంలోగా ఏపీకి కొత్త డీజీపీని ఈసీ నియమించే అవకాశం ఉంది. విజయవాడ పోలీస్ కమిషనర్, ఇంటెలీజెన్స్ డీజీపై కూడా ఈసీ గతంలో వేటు వేసిన విషయం తెలిసిందే. విజయవాడలో సీఎం జగన్ పై దాడి ఘటన నేపథ్యంలో వీరిద్దరిపై బదిలీ వేటు వేసింది ఈసీ.

మరో వైపు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కూడా ఈసీ యాక్షన్ తీసుకుంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. CS జవహర్‌రెడ్డి తీరుపైనా ఇప్పటికే ఈసీకి అనేక ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా న్షన్ల పంపిణీ వ్యవహారంలో CS తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహంగా ఉన్నాయి. ఈసీ ఆదేశాలను ఆయన అమలు చేయడం లేదంటూ ఇప్పటికే ఫిర్యాదు చేశాయి ప్రతిపక్షాలు.

#ap-elections-2024 #anantapur #ap-election-commission
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe