వైసీపీ సర్కార్‌కు అప్పుల మీద ఉన్న శ్రద్ద అభివృద్ధిపై లేదు: పురంధేశ్వరి

వైసీపీ సర్కార్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి అప్పుల మీద ఉన్న శ్రద్ద అభివృద్ధిపై లేదని మండిపడ్డారు. ఒక్క పరిశ్రమ లేదు, ఉద్యోగం లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు‌.

New Update
వైసీపీ సర్కార్‌కు అప్పుల మీద ఉన్న శ్రద్ద అభివృద్ధిపై లేదు: పురంధేశ్వరి

Purandheswari: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి అప్పుల మీద ఉన్న శ్రద్ద అభివృద్ధిపై లేదని విమర్శించారు. ఒక్క పరిశ్రమ లేదు, ఉద్యోగం లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర పాలకులకు వాళ్ళ జేబులు నింపుకోవడం పై ఉన్న శ్రద్ధ సుపరిపాలనపై లేదని ధ్వజమెత్తారు.

Also read: గెలుపే లక్ష్యంగా జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం

ఈ క్రమంలోనే అమరావతి రాజధానికి కేంద్రం కట్టుబడి ఉందని వ్యాఖ్యనించారు. మూడు రాజధానులంటూ వైసీపీ మూడు ముక్కలాటకు తెర లేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులకు ఇవ్వాల్సిన కౌలు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని అభివృద్ధి కోసం 2వేల 500 కోట్లు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డు, అమరావతి- అనంతపురం రోడ్డుకు కేంద్రం నిధులు ఇచ్చిందని చెప్పారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిపాలన భవనానికి, రిసెర్చ్ భవనానికి కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు.

Also Read: జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో వంచన: నాదెండ్ల మనోహర్

ఎయిమ్స్ వద్ద ఉన్న హై టెన్షన్ వైర్లు తొలగింపు, త్రాగు నీటిని అందించకపోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో రాష్ట్రం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద జగన్ ఇస్తుంది కేవలం ఆరు వేలు మాత్రమేనని అన్నారు. వై ఏపి నీడ్స్ జగన్ లో సచివాలయల వద్ద పార్టీ జెండా ఎగురవేస్తున్నారని ఫైర్ అయ్యారు.ఏపీ ఏర్పడిన తర్వాత కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేసిందని వెల్లడించారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. పేదల కోసం కేంద్రం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని వ్యాఖ్యనించారు.

Advertisment
తాజా కథనాలు