AP BJP: వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్ ప్రభుత్వం.. పురంధేశ్వరి చురకలు జగన్ సర్కార్ పై సెటైర్లు వేశారు ఏపీ బీజేపీ ఛీఫ్ పురంధేశ్వరి. వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్ ప్రభుత్వం అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి 124 కోట్లు అప్పు తీసుకుందని ఆరోపించారు. ఐటీ పరిశ్రమను పూర్తిగా ధిగజార్చారని మండిపడ్డారు. By V.J Reddy 19 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి AP BJP Chief Purandeswari: విశాఖలో పర్యటించిన ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి అందించడం లేదని ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వానికి పేదలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదని మండిపడ్డారు. టిడ్కో ఇండ్లను లబ్ధిదారులకు అందించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి 124 కోట్లు అప్పు తీసుకుందని సంచలన ఆరోపణలు చేశారు. ALSO READ: పెన్షన్ రూ. 4వేలకు పెంపు.. రూ. 500కే గ్యాస్ సిలిండర్.. ఆ రోజునుంచే? పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. కార్యకర్తలను కలవడం తో పాటు పార్టీ ని బలోపేతం చేయడానికి అన్ని జిల్లాలో పర్యటిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 20 జిల్లాలో పర్యటన చేసినట్లు తెలిపారు. కేంద్రం ప్రభుత్వం ప్రతి జిల్లా కు ఏవిధంగా సహకారం అందిస్తుందో ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. 290 కోట్లతో విశాఖలో ఈ ఎస్ ఐ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తే ఆసుపత్రికి కావాల్సిన 10 ఎకరాలు భూమి ఇచ్చారని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన మెడికల్ కళాశాలను కోల్పోయామని అన్నారు. విశాఖ అభివృద్ది కి బీజేపీ వారసులు అని తెలిపారు. అనేక కేంద్ర ప్రభుత్వ విద్య సంస్థలు విశాఖ లో నెలకొల్పినట్లు చెప్పారు. విశాఖ లోని నడుపురూ వద్ద మెడ్ టెక్ జోన్ ఏర్పాటు చేశామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం భూకబ్జాలు చేయడానికి మనుషులను తెచ్చుకోవడం కోసం కడప నుంచి ఫ్లైట్ వేసరోమే అనిపిస్తుందని చురకలు అంటించారు. రైల్వే జోన్ కు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైల్ కు డి పి ఆర్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం జాపకం చేస్తుందని అనడం దారుణమని అన్నారు. ALSO READ: పథకాల కోసం డబ్బులు లేవు.. సీఎం వీడియో వైరల్ జగన్ సర్కార్ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను పూర్తిగా ధిగజార్చారని అన్నారు. అనేక ఐటీ పరిశ్రమలు విశాఖ వదిలి వెళ్ళిపోయాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు పేరు మార్చి తామే ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుందని విమర్శించారు. విశాఖలో అనేక ప్రభుత్వ ఆస్తులను తనకా పెట్టారని ఆరోపించారు. విశాఖ లో ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు అప్పనంగా భూములు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ బోడి గుండు చేశారని ఎద్దేవా చేశారు. విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న నైతిక హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని అన్నారు. #ap-news #ys-jagan #ap-bjp-chief-purandeswari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి